గో హత్యను నిరోధించేందుకు కలసికట్టుగా పనిచేద్దాం… అఘోరిని
1 min readపల్లెవెలుగు వెబ్ మహానంది: దేశంలో ఎక్కడ గోహత్య, స్త్రీ హత్య జరగకుండా అందరం కలసికట్టుగా పోరాటం చేయాలని మహిళా అఘోరిని శివ విష్ణు బ్రహ్మ త్రిమూర్తి కోరారు. శనివారం ఉదయం శ్రీకామేశ్వరి దేవి సహిత మహానందీశ్వర స్వామివార్లను దర్శించుకున్నారు. అనంతరం కళ్యాణ మండపంలో ఏ ఈఓ మధు, వేదపండితులు రవిశంకర్ అవధాని,హనుమంత రావు, ఆంజనేయ శర్మలు స్వామివార్ల ప్రసాదాలను అందజేశారు. అనంతరం అఘోరిని మాట్లాడుతూ ప్రస్తుతం చిన్నపిల్లల పైన అఘాయిత్యాలు జరుగుతున్నాయని వాటిని అరికట్టడం ప్రతి ఒక్కరిపై బాధ్యత ఉందన్నారు. ఇప్పటికి మూడు దేశాలు తిరగడం జరిగిందన్నారు. ఎటువంటి అవాంతరాలు జరగకుండా ఎస్ ఐ రామ్మోహన్ రెడ్డి, సిబ్బంది ద్వారా పహారా నిర్వహించారు.