పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకులను పూజిద్దాం
1 min readరాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్
పది సంవత్సరాలుగా మట్టి వినాయకులను వాసవి ఏజెన్సీస్ పంపిణీ చేయడం శుభ పరిణామం.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ప్రతి ఒక్కరం పర్యావరణ పరిరక్షణ కోసం నడుం బిగించి మట్టి వినాయకులనే పూజిద్దామని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేశ్ అన్నారు. గురువారం పాత బస్టాండ్ లోని వాసవి ఏజెన్సీస్ మేనేజింగ్ డైరెక్టర్ శేషు ఫణిశెట్టి ఆధ్వర్యంలో 2000 మట్టి వినాయకులను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర ఆర్యవైశ్య నాయకులు ఇల్లూరు లక్ష్మయ్య,దేవకి వెంకటేశ్వర్లు ల తో కలసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ వాసవి ఏజెన్సీస్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ కోసం గత పది సంవత్సరాలుగా కృషి చేస్తూ మట్టి వినాయకులను ప్రజలకు ఉచితంగా అందించడం అభినందనీయం అన్నారు. పర్యావరణానికి హాని కల్పించే ప్లాస్టిక్, పిఓపి పట్ల ప్రజల్లో అవగాహన కల్పిస్తూ వాటి వాడకం తగ్గిస్తూ వాటి పట్ల దూరంగా ఉండేలా ప్రజలలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని టీజీ వెంకటేష్ అన్నారు . వాసవి ఏజెన్సీస్ వారు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని మట్టి వినాయకులను పూజించేందుకు ప్రజలను ప్రోత్సహించాలని టీజీ వెంకటేష్ కోరారు .ఈ కార్యక్రమంలో విహెచ్పి జిల్లా అధ్యక్షుడు గోరంట్ల రమణ, జిల్లా ఆర్యవైశ్య నాయకులు శేషగిరి శెట్టి, ఆవోపా నాగేశ్వరరావు, జవహర్ బాబు,సురేష్, పురుషోత్తం,లగిశెట్టి కిరణ్,అవినాష్ శెట్టి, భరత్, తదితరులు పాల్గొన్నారు.