విద్యార్థి దశలో గ్రంథాలయాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి
1 min readకర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : గ్రంథాలయాలు విద్యార్థి దశలో ప్రముఖ పాత్ర పోషిస్తాయని కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు పేర్కొన్నారు.గురువారం స్థానిక జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహిస్తున్న “57వ జాతీయ వారోత్సవాల”ను నిర్వహించారు.ఈ సందర్భంగా కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో “57వ జాతీయ వారోత్సవాలను” ఈ నెల 14వ తేది నుండి 20వ తేది వరకు నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. గ్రంథాలయాలు అనేవి విద్యార్థి జీవితంలో ప్రముఖ పోషిస్తాయన్నారు. గ్రంథాలయాల ద్వారా విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధం అవ్వడంతో పాటు సామాన్య ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో గ్రంథాలయాలను అభివృద్ధి చేయడానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. ఢిల్లీ పార్లమెంటులో కూడా ఒక పెద్ద గ్రంథాలయం ఉందని ఎంపి గా ఎన్నికైన తరువాత అక్కడి గ్రంథాలయంలో కూడా సభ్యత్వం తీసుకోవడం జరిగిందని దాని ద్వారా భారతదేశంలో ఏ సంఘటన జరిగిన సదరు సమాచారాన్ని మొబైల్ కు సందేశం రావడం జరుగుతుందని ఇది కేవలం ఒక గ్రంథాలయానికే సాధ్యం అన్నారు. కర్నూలు పరిధిలో ఉన్న గ్రామాల్లో కూడా గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని వాటి ద్వారా విద్యార్థులకు విద్య పట్ల చైతన్యం కలిగి వలసలను కూడా నివారించే అవకాశం ఉంటుందన్నారు.అంతకుముందు గ్రంథాలయంలోని ఉన్న సరస్వతీ దేవి విగ్రహానికి పూలమాల వేసి, జాతీయ జెండా ఆవిష్కరణ చేసి, గ్రంథాలయ పితామహుడు గాడిచర్ల హరిసర్వోత్తమరావు విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించి ప్రతిజ్ఞ చేశారు.అనంతరం జిల్లా కేంద్ర గ్రంథాలయం నుండి కొండారెడ్డి బురుజు వరకు ఏర్పాటు చేసిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారుకార్యక్రమంలో జిల్లా కేంద్ర గ్రంథాలయ సెక్రటరీ కె.ప్రకాష్, మాజీ గ్రంథాలయ ఛైర్మన్లు కె.చంద్రశేఖర కల్యూర, కె.జి.గంగాధర రెడ్డి, ఉప గ్రంథాలయ అధికారి పెద్దక్క, గ్రంథాలయ సిబ్బంది రాజు, శ్రీనివాసులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.