‘కూటమి ప్రభుత్వం’లో రోడ్లకు వెలుగు..
1 min readరోడ్డు పనులకు ఎమ్మెల్యే జయసూర్య భూమి పూజ..
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లకు వెలుగులా రోడ్లు తయార్ అవుతున్నాయని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు. గురువారం ఉదయం నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలో సబ్ స్టేషన్ దగ్గర (నందికొట్కూరు-నంద్యాల రహదారి)డబుల్ రోడ్ లైన్ కు ఎమ్మెల్యే పూజలు చేసి రోడ్డు పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మిడుతూర్ సబ్ స్టేషన్ దగ్గర నుండి కిలోమీటర్ నర డబల్ రోడ్డు లైన్ మరియు నందికొట్కూరు నుండి తలముడిపి వరకు రోడ్డు మరమ్మతుల కొరకు 7 కోట్ల 50 లక్షలు నిధులతో రోడ్డు వేయిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.ఎన్నో ఏళ్ల నుంచి పూర్తి చేయని రోడ్లను ఈ ప్రభుత్వం పూర్తి చేస్తుందని రోడ్డు పనులను పూర్తి చేయుటకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోయినా అధికారులతో మాట్లాడి పనులు ప్రారంభించడం జరిగిందని కాంట్రాక్టర్లు చేసిన పనులకు వెంటనే బిల్లులు వస్తున్నాయని అదేవిధంగా కలమందలపాడు వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రైతులకు సాగునీరు అందించేందుకు అసెంబ్లీలో నేను ప్రస్తావించడం జరిగిందన్నారు.నందికొట్కూరు-నంద్యాల వరకు ఫోర్ లైన్ హైవే రోడ్డు మంజూరు గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లడం జరిగిందని ఆయన అన్నారు.మిడుతూరు-పీరు సాహెబ్ పేట రోడ్డు అద్వాన్నంగా ఉండటంతో ప్రయాణికులు గాయాల పాలవుతున్నారని గ్రామ టిడీపీ నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.ఈ కార్యక్రమంలో టిడీపీ మండల కన్వీనర్ కాతా రమేష్ రెడ్డి, మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి, ఆర్అండ్ బీ డీఈఈ గోవర్ధన్, ఈఈ మనోధర్,మండల నాయకులు వంగాల శివరామిరెడ్డి,భూపాల్ రెడ్డి, మనోహర్ రెడ్డి,హరి సర్వోత్తమ్ రెడ్డి,సంపంగి రవీంద్రబాబు,నాగ స్వామి రెడ్డి,చాకర్ వలి,జనసేన సంపత్,సామన్న, లక్ష్మీనారాయణ,ఐటీడీపీ ఇంతియాజ్ పాల్గొన్నారు.