PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పేదల జీవితంలో..వెలుగులు…

1 min read

ఏడాదికి మూడు సిలింండర్లు ఉచితంగా అందజేసిన ఘనత సీఎం చంద్రబాబుదే

జిల్లాలో  4 లక్షల 72 వేల 851 మందికి ఉచిత గ్యాస్ సిలిండర్లు

ఓర్వకల్లు పారిశ్రామిక వాడ అభివృద్ధఙకి.. 2.800 కోట్లు మంజూరు

రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రివర్యులు టి.జి.భరత్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు దీపం-2 పథకం ద్వారా పేదల జీవితంలో వెలుగులు నింపుతున్నారని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రివర్యులు టి.జి.భరత్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియంలో  దీపం పథకం-2 (ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకం) కార్యక్రమాన్ని నిర్వహించారు.  ఈ సందర్భంగా  మంత్రి మాట్లాడుతూ  సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా దీపం-2  పథకం కింద ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా అందజేస్తామన్నారు.  సంక్షేమమే కాకుండా ఎన్నో అభివృద్ధి పనులు కూడా   చేస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు, పెట్టుబడులే లక్ష్యంగా మానవ వనరుల అభివృద్ధి ,ఐటీ ఎలక్ట్రానిక్స్‌, కమ్యూనికేషన్ శాఖల మంత్రి వర్యులు నారా లోకేష్  అమెరికా పర్యటనలో వివిధ సంస్థలు, ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారన్నారు..  రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు సెలవు రోజు అని కూడా లేకుండా  ప్రజా ప్రతినిధులు అందరూ ప్రతిరోజూ చాలా కష్టపడుతున్నామన్నారు..

 ఓర్వకల్లు అభివృద్ధికి రూ.2,800 కోట్లు మంజూరు

 జిల్లాలో ఓర్వకల్లు పారిశ్రామిక వాడ అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో 2 వేల 800 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయన్నారు. పరిశ్రమల ఏర్పాటు వల్ల నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు  కలిగి వేల కుటుంబాలు ఆర్థికంగా బలపడతాయన్నారు. రాష్ట్రంలో  ముఖ్యమంత్రి ప్రవేశ పెట్టిన నూతన ఇండస్ట్రియల్ పాలసీ మిగతా రాష్ట్రాలతో పోలిస్తే  బాగుందని  ఇతర రాష్ట్రాల వారు కూడా ప్రశంసిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. అనంతరం ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ దీపావళి పండుగ సందర్భంగా ప్రతి ఇంట్లో వెలుగులు నింపలనే ఉద్దేశ్యంతో దీపం – 2 పథకం ద్వారా లబ్దిదారులకు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తున్నారన్నారు ..రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారన్నారు.

48 గంటల్లోపు… మొత్తం నగదు అందజేత… : జేసీ డా.బి.నవ్య

 ఆ తరువాత  జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య మాట్లాడుతూ కట్టెల పొయ్యిలో వంట చేసే మహిళల ఆరోగ్యం బాగుండాలనే సీఎం చంద్రబాబు నాయుడు దీపం–2 పథకాన్ని ప్రారంభించాడని, అర్హులైన కుటుంబాలకు ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా అందజేస్తామన్నారు.   అక్టోబరు 29 నుంచి బుకింగ్ చేసుకున్న వారికి  31వ తేదీన దీపావళి పండగ సంద్భంగా అందజేశామన్నారు.   నగదును 24-48 గంటలల్లోపు చెల్లించిన మొత్తాన్ని ఆధార్ కార్డు తో అనుసంధానం చేసిన బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయడం జరుగుతుందన్నారు.  అదే విధంగా సంవత్సరంలోని నాలుగు నెలలను ఒక్కొక్క బ్లాక్ గా (ఏప్రిల్ నుంచి జూలై వరకు 1 బ్లాక్, ఆగస్టు నుంచి నవంబరు వరకు 1 బ్లాక్, డిసెంబరు నుంచి మార్చి నెల వరకు 1 బ్లాక్) గా విభజించడం జరిగిందని ఇప్పుడు ఉన్న బ్లాక్ ప్రకారం మార్చి 31వ తేది వరకు ఉచిత గ్యాస్ సిలిండర్ ను బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది కావున లబ్ధిదారులు కంగారు  పడకుండా గ్యాస్ ఏజెన్సీల వద్ద ఇబ్బందులు పడకుండా బుక్ చేసుకోవాలన్నారు అదే విధంగా ఎటువంటి సమస్యలు ఉన్న టోల్ ఫ్రీ నెంబర్ 1967 కు ఫోన్ చేసి ఏమైనా సమస్యలు ఉంటే రిజిస్టర్ చేసుకోవచ్చు అని వారి అభ్యర్థనలను పరిష్కరించడం జరుగుతుందన్నారు. మహిళలు అందరూ ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ ను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ పథకం ద్వారా వచ్చే గ్యాస్ సిలిండర్ ను ఇతరులకు ఇవ్వకుండా మహిళలు వారి సొంత అవసరాలకు మాత్రమే ఉపయోగించుకోవాలని జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు.

ప్రతి ఇంట్లో… ఆనందం : స్టేట్ సివిల్ సప్లైస్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ

స్టేట్ సివిల్ సప్లైస్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఈ పథకం ద్వారా ప్రతి ఇంట్లో ఆడపడుచు ఆనందంగా పండుగ చేసుకోవడం జరుగుతుందన్నారు. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా కుటుంబాలు బాగా ఉండాలని, సమాజం బాగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం  ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. ఇందుకు కృషి చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , మంత్రి లోకేష్ లకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.  సమాజ శ్రేయస్సు కొరకు, ప్రజల మేలు కొరకు ముఖ్యమంత్రి కృషి చేయడం జరుగుతుందన్నారు.  అంతకుముందు దీపం-2 పథకం ద్వారా లబ్ధి పొందిన లబ్దిదారులు వారి అభిప్రాయాలను మంత్రికి వివరించారు. అదే విధంగా ఒకటవ తేదీన అర్హులైన లబ్ధిదారులకు అందజేసే ఎన్టీఆర్ పెన్షన్ భరోసా నగదును లబ్ధిదారులకు స్వయంగా మంత్రి, ఎంపీ, జాయింట్ కలెక్టర్ అందజేశారు. కార్యక్రమంలో కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, మున్సిపల్ కమీషనర్ రవీంద్ర బాబు, డిఎస్ఓ రాజరఘువీర్, మెప్మా పిడి నాగశివలీల,  పొదుపు సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు.

About Author