PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కర్నాటక మద్యం స్వాధీనం…

1 min read

ఇద్దరు వ్యక్తులు అరెస్టు బైక్ సీజ్

పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం:   కర్ణాటక నుండి అక్రమంగా మద్యం తరలిస్తుండగా పోలీసులు దాడి చేసి పట్టుకున్న సంఘటన శనివారం మండల పరిధిలోని మాధవరం గ్రామంలో చోటు చేసుకుంది. మాధవరం ఎస్సై విజయ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం . కోసిగి మండలం డి బెళగల్ గ్రామానికి  తిరుమలేష్, చెన్నకేశవ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు కర్ణాటక నుండి బైక్ పై నాలుగు బాక్స్ లలో 384 ఒరిజినల్ చాయిస్ డీలక్స్ టెట్రా పాకెట్లు తీసుకుని వస్తుండగా మాధవరం శివారు లో తనిఖీలు నిర్వహించి  అరెస్టు చేసి మధ్యం స్వాధీనం చేసుకుని బైక్ ను సీజ్ వారి ని రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై విజయకుమార్ తెలిపారు. ఈ తనిఖీల్లో కానిస్టేబుల్ వీరాంజనేయులు, ఉన్నారు.

About Author