మహానంది మండలంలో ప్రారంభం కాని మద్యం దుకాణాలు
1 min readపల్లెవెలుగు వెబ్ మహానంది: మహానంది మండలంలో బుధవారం ప్రవేటు మద్యం దుకాణాలు ప్రారంభం కాలేదు. మహానంది మండలానికి మూడు మద్యం దుకాణాలు మంజూరయ్యాయి .తిమ్మాపురం మరియు మహానంది తో పాటు గాజులపల్లె గ్రామాల్లో వీటిని ప్రారంభించాల్సి ఉంది. లేదా మార్పులు కూడా చోటు చేసుకోవచ్చు. కానీ బుధవారం వీటిని ప్రారంభించలేదు. కారణాలు తెలియాల్సి ఉంది. దీనిపై ఎక్సైజ్ సీఐ కృష్ణమూర్తి నీ వివరణ కోరగా ఈరోజు రాత్రికి ప్రారంభిస్తారని మద్యాన్ని కూడా డిపో నుండి షాపు యజమానులకు అందజేశామని తెలిపారు. ఎలాంటి సమస్యలు లేవన్నారు.