సమస్యలు వింటూ..ఎమ్మెల్యే పింఛన్ల పంపిణీ
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ఒకటవ తేదీన కాకుండా ఒకరోజు ముందుగానే పింఛన్లు పంపిణీ చేస్తూ అదే విధంగా వారి సమస్యలను తెలుసుకుంటూ ఆప్యాయంగా పలకరిస్తూ లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పింఛన్ల నగదును అందజేశారు నంద్యాల జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య..ఈ రోజున నూతన సంవత్సరం కావున ఒకరోజు ముందు శనివారం రోజునే పింఛన్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.నిన్న ఉదయం నుండే గ్రామాల్లో పింఛన్ల సందడి నెలకొంది. ఎమ్మెల్యే జయసూర్య నిన్న నందికొట్కూరు మండలం లోని కొణిదెల,నాగటూరు, బిజినవేముల గ్రామాల్లో ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లను పట్టించేశారు.బిజినవేముల గ్రామంలో గ్రామ సర్పంచు రవి యాదవ్ తో కలసి పింఛన్లు అందజేశారు.పట్టణంలోని 7వ వార్డులో దూదేకుల దుర్గయ్య గత నెలలో మరణించారు. ఈయన భార్య అయిన దూదేకుల శాలిభీకి నూతనంగా పింఛన్ మంజూరు అయింది.ఈ నగదును టిడిపి నాయకులు మైనార్టీ సెల్ నియోజవర్గ అధ్యక్షులు సౌదీ చాంద్ మరియు పట్టణ మైనార్టీ నాయకులు గౌండ అబ్దుల్లా అధికారులతో కలిసి పింఛన్లను పంపిణీ చేశారు. అంతే కాకుండా అన్ని గ్రామాల్లో మరియు పట్టణంలో అన్ని వార్డుల్లో అధికారులు పింఛన్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సుబ్రహ్మణ్యం శర్మ, మల్లికార్జున రెడ్డి,హరీష్ రెడ్డి, మోహన్ రెడ్డి,కిరణ్ కుమార్ రెడ్డి,మద్దిలేటి,బాబులాల్ తదితరులు పాల్గొన్నారు.