సాహిత్యమే సమాజ గతిని మార్చగలదు
1 min readటి. యన్ గ్రంథాలయం సిపిఎం. జిల్లా కార్యదర్శి.గౌస్ దేశాయ్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: సాహిత్యమే సమాజ గతిని మార్చ గలదని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్ అన్నారు. కర్నూల్ నగర పాలక పరిధిలోని 32 వ వార్డు ముజఫర్ నగర్ లోని టి.నరసింహయ్య గ్రంథాలయంలో సిపిఎం ఉద్యమ నేత టి నరసింహయ్య గారి ఆరవ వర్ధంతి సభ గ్రంథాలయ అధ్యక్షులు కే ప్రభాకర్ అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్,నరసింహయ్య కుమారుడు హరి. సాహితీ స్రవంతి రాష్ట్ర నాయకులు జంధ్యాల రఘుబాబు లు మాట్లాడారు. కామ్రేడ్ టి నర్సింహయ్య జీవిత కాలం గ్రంథాలయం, సాహిత్యం సైద్ధాంతిక అవగాహన అభివృద్ధి పైనే ఎక్కువ కృషి జరిగిందని ఆ కృషి కారణంగానే కార్యకర్తలు సంఘాల నిర్మాణానికి బలం చేకూరిందని వారు అన్నారు.అనంతరం గ్రంథాలయం గౌరవ అధ్యక్షులు డాక్టర్ బడే సాహెబ్ మాట్లాడుతూ విజ్ఞానం పంచే గ్రంథాలయాల ద్వారా సాహిత్య అభివృద్ది జరగడమే నరసింహయ్య గారికి నిజమైన నివాళులు అర్పించడం అవుతుందని అన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ కార్యదర్శి బి ఆజాద్, నాయకులు విజయ్ ధనుష్ పార్టీ నాయకులు జె ఎన్ శేషయ్య సిపిఎం పార్టీ న్యూ సిటీ కార్యదర్శ వర్గ సభ్యులు సుధాకరప్ప, నగర కమిటీ సభ్యులు ఆనంద్, ధనలక్ష్మి ఆటో యూనియన్ నాయకులు హుస్సేన్ వలి షంషీర్, నబి, శంకరయ్య, శంకర్, భాష, నాగరాజు, సిఐటియు నాయకులు అయ్య స్వామి సురేష్ మహిళా నాయకులు దానమ్మ ఈశ్వరమ్మ నాగేశ్వరమ్మ. పార్టీ అభిమానులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.