PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జీజీహెచ్​ సెమినార్ హాల్లో లివర్ పై అవగాహన కార్యక్రమం

1 min read

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల గ్యాస్ ఎంట్రాలజీ విభాగంలో  గురించి.

అడిషనల్ డీఎంఈ & సూపరింటెండెంట్, డా.V.వెంకటరంగా రెడ్డి, మాట్లాడుతూ:—

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో  గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగానికి KMC పూర్వపు విద్యార్థి మరియు ప్రసిధ్ధి చెందిన అంతర్జాతీయ  గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్  డా.నలిని మోహన్ గూడ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగానికి సందర్శించారు అనంతరం గ్యాస్ట్రో ఎంటరాలజీ లోని లేటెస్ట్ డెవలప్మెంట్  మరియు లివర్ డిసీస్ పై అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.ఆసుపత్రిలోని గ్యాస్ ఎంట్రాలజీ సెమినార్ హాల్లో అరుదైన (లేటెస్ట్ గ్యాస్ట్రో ఎంటరాలజీ) ప్యాంక్రియాటిక్ పిత్తాశయ  లివర్ కేసులపై వైద్య అధ్యాపకులు మరియు వైద్య విద్యార్థులతో కలిసి వారి యొక్క ఉపన్యాసం చేసినట్టు తెలిపారు.ఆసుపత్రిలో అరుదైన గ్యాస్ట్రో ఎంటర్రాలజీ కేసులపై పలువురు వైద్యులతో సలహాలు సూచనలు తెలియజేసినట్లు తెలిపారు.ఆసుపత్రిలో గతంలో ఐదు లక్షల విలువ గల వైద్య పరికరాలు గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగానికి అందించినట్లు తెలియజేశారు.ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రసిద్ధ చెందిన అంతర్జాతీయ  గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్  డా.నళిని మోహన్ గూడా కి ఘనంగా శాలువాతో సన్మానించి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమానికి ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్, డా.ప్రభాకర్ రెడ్డి, కేఎంసీ వైస్ ప్రిన్సిపాల్, డా.హరి చరణ్, జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్, డా.లక్ష్మీబాయి, ఎండోక్రైనాలజీ హెచ్ ఓ డి, డా.శ్రీనివాసులు, మరియు డా.మోహన్ రెడ్డి,  డా.రామచంద్రనాయుడు, CSRMO డా.వెంకటేశ్వరరావు, మరియు వైద్య విద్యార్థులు తదితరులు పాల్గొన్నట్లు, అడిషనల్ డీఎంఈ & సూపరింటెండెంట్, డా.V.వెంకటరంగా రెడ్డి,  తెలిపారు.

About Author