PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘ ఆర్క్​ ’లో లివర్​ ట్రాన్స్​ప్లాంట్​ క్లినిక్​ ప్రారంభం..

1 min read

అత్యాధునిక టెక్నాలజీతో కాలేయ మార్పిడి..

  • నైపుణ్యం…అంకితభావంతో… వైద్యసేవలు మెరుగు..
  •  లివర్​ ట్రాన్స్​ ప్లాంట్​ వైద్య నిపుణులు డా. అమర్​నాథ్​

కర్నూలు, పల్లెవెలుగు:ప్రపంచ స్థాయి సంరక్షణ… అత్యాధునిక టెక్నాలజీతో లివర్​ ట్రాన్స్​ప్లాంట్​ సాధ్యమవుతుందన్నా రు లివర్​ ట్రాన్స్​ ప్లాంట్​ వైద్య నిపుణులు డా. అమర్​నాథ్​ స్పష్టం చేశారు.  స్థానిక గాయత్రి ఎస్టేట్​లోని ఆర్క్​ హాస్పిటల్ లో ఆర్క్​ మరియు గ్లెనీగల్స్ హైదరాబాద్​​ హాస్పిటల్స్​ వారి సంయుక్త ఆధ్వర్యంలో లివర్​ ట్రాన్స్​ ప్లాంట్​ క్లినిక్​ ను ప్రారంభించినట్లు ఆర్క్​ హాస్పిటల్​ మేనేజింగ్​ డైరెక్టర్స్​ డా. కె.శశి వర్ధన్​ రెడ్డి, డా. త్రినాథ్​ తుమ్మేపల్లి, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్​ డా. రితేష్​ రెడ్డి, గైనకాలజిస్ట్​ డా. పాటిల్​ అమల​ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆర్క్​ హాస్పిటల్​లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  లివర్​ ట్రాన్స్​ ప్లాంట్​ వైద్య నిపుణులు డా. అమర్​నాథ్​ మాట్లాడుతూ  గ్లెనీగల్స్ హాస్పిటల్​లో వందల సంఖ్యలో కాలేయ మార్పిడి చేశామని, అందులో 90శాతం  విజయవంతమయ్యాయన్నారు. కాలేయం పూర్తిగా పాడైనప్పుడు దాత సహాయంతో కాలేయ మార్పిడి చేస్తామన్నారు. ఇందుకు అంకితభావం… ఆధునిక టెక్నాలజీతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామన్నారు. ఇటీవలె కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం అరికెర గ్రామానికి చెందిన అనిల్​ కుమార్​ (11), తనుశ్రీ (9) కి లివర్​ మార్పిడి చేశామని, ఇప్పటి వరకు వారు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోలేదన్నారు.  వారిని నిత్యం తమ హాస్పిటల్​ సిబ్బంది పర్యవేక్షణలో ఉంటారన్నారు. అనంతరం ఆర్క్​ హాస్పిటల్​ ఎం.డి. డా.కె.శశిధర్​ రెడ్డి మాట్లాడుతూ రాయలసీమ జిల్లాలతోపాటు మహబూబ్​నగర్​, రాయచూరు జిల్లా ప్రజలకు అధునాతన  టెక్నాలజీతో కూడిన వైద్య సేవలు అందించేందుకు  కాలేయ మార్పిడి క్లినిక్​ మరింత దోహద పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచ స్థాయి వైద్య ప్రమాణాలతో విశిష్టమైన వైద్య సేవలు అందిస్తున్న ‘ ఆర్క్​’ హాస్పిటల్​ ఇప్పుడు గ్లెనీగల్స్​ హైదరాబాద్​ వారితో కలిసి కాలేయ మార్పిడి క్లినిక్​ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. కాలేయ మార్పిడి కోసం బెంగుళూరు, హైదరాబాద్​కు వెళ్లకుండా…కర్నూలులోని ‘ ఆర్క్​’ హాస్పిటల్​లో మెరుగైన వైద్య సేవలు పొందవచ్చన్నారు.  లివర్​ ట్రాన్స్​ ప్లాంట్​ వైద్య నిపుణణులు డా. అమర్​నాథ్​, డా. చందన్​ కుమార్​, డా. రాజ్​ గోపాల్​ మరియు ఆర్క్​ హాస్పిటల్స్​ కన్సల్టెంట్​ గ్యాస్ర్టో ఎంటరాలజిస్ట్​ డా. జి. రితేష్​ రెడ్డితోపాటు మరికొందరు వైద్య నిపుణులు నిత్యం అందుబాటులో ఉంటారని ఈ సందర్భంగా ఆర్క్​ హాస్పిటల్​ ఎం.డి. డా.కె.శశివర్ధన్​ రెడ్డి వెల్లడించారు.  

About Author