ఎల్ఎల్సీ కాలవకు ఏప్రిల్ 15 వరకు సాగునీటికి నీళ్లు ఇవ్వాలి..
1 min readపల్లెవెలుగు వెబ్ ఆలూరు: కర్నూలు లో జరిగిన ఐ ఏ బి మీటింగ్ ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి పాల్గొన్నారు. ఈ మీటింగ్ లో ఆలూరు నియోజకవర్గ పరిధిలోని పలు అంశాలపై జిల్లా కలెక్టర్ కు,జిల్లా మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కురుకుంద గ్రామ ప్రజల నీటి కష్టాల తీర్చడం కోసం హేబ్బటం నుండి కురుకుందుకు 30 లక్షలతో కూడిన ఎస్టిమేషన్ కాఫీని కలెక్టర్ కు ఇవ్వడం జరిగింది. ఎల్ఎల్సీ కాలవకు ఏప్రిల్ 15 వరకు సాగునీటికి నీళ్లు ఇవ్వాలని కోరడమైనది. ఎల్.ఎల్.సి కాలవ డిస్ట్రిబ్యూటర్లను,రోడ్లును మరమ్మత్తులు చేయాలని కోరడమైనది . ఎల్ ఎల్ సి కాల్వ పక్కనే ప్రవహిస్తున్న గజ్జల్లి గ్రామానికి తాగునీటి కష్టాలు చెవి చూస్తున్నారు వాళ్ళ దాహార్తిని తీర్చాలంటే ఎల్ ఎల్ సి కాలవ నుండి ఎస్ ఎస్ ట్యాంకు ను మరమ్మతులు దాని మరింత నీటి సామర్థ్యం పెంచి నీళ్లు నింపాలి.చింతకుంట, బాపూరం,విరుపాపురం, సమ్మతిగేరి ,హేబ్బటం,ఎస్ ఎస్ ట్యాంకులను మరమ్మతులు చేసి ఆ ట్యాంకులను మరింత నీటి సామర్థ్యాన్ని పెంచాలి. ఆలూరు ఉన్న చెరువు అన్యాక్రాంతం అయిన చెరువును పరిరక్షించి చెరువు పూడికతీసి ఆ చెరువుకు బాపురం నుండి ద్వారా లేక హంద్రీనీవా ద్వారా అయిన పైపులైన్ వేసి చెరువు నింపాలని కోరారు .