PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తక్కువ ధరకే..బియ్యం..

1 min read

ఇన్​చార్జ్​ జేసీ మధుసూదన్​ రావు

కర్నూలు, పల్లెవెలుగు:పేద, మధ్య తరగతి ప్రజలకు తక్కువ ధరకు బియ్యం, కందిపప్పు, ముడి బియ్యం ఇవ్వాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రైతు బజార్లలో సరసమైన ధరలకు అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు ఇన్​చార్జ్​ జాయింట్​ కలెక్టర్​ మధుసూదన్​ రావు.  పౌర సరఫరాల కమీషనర్​ ఉత్తర్వుల మేరకు శుక్రవారం నగరంలోని రైతు బజార్లు, చెయిన్​ రిటైల్​ మార్కెట్లలో  ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి… బియ్యం, కందిపప్పును తక్కువ ధరకు విక్రయించేలా చర్యలు తీసుకున్నారు.  స్టీమ్డ్ రైస్​ కిలో రూ.48 ( మార్కెట్​ ధర రూ.55.85), ముడి బియ్యం కిలో రూ.47 ( మార్కెట్​ ధర రూ.52.40), కందిపప్పు కిలో రూ.150 ( మార్కెట్​  ధర రూ.181) లకు నగరంలోని రైతు బజార్లు, చెయిన్​ రిటైల్​ మార్కెట్లలో విక్రయిస్తున్నారని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా డీఆర్​ఓ, ఇన్​చార్జ్​ జాయింట్​ కలెక్టర్​ మధుసూదన్​ రావు సూచించారు.

About Author