కర్నూలు టూ బళ్లారి హైవే ఏర్పాటు పై కేంద్ర మంత్రి తో చర్చించిన ఎంపి
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ని కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు మర్యాద పూర్వకంగా కలిశారు.. పార్లమెంట్ సమావేశాలలో పాల్గొంటున్న ఎం.పి, ఢిల్లీలో ని గడ్కరీ కార్యాలయంలో ఆయన్ను కలిసి కర్నూలు టూ బళ్ళారి హైవే ఏర్పాటు పై చర్చించారు.. అనంతరం వినతిపత్రం సమర్పించారు.. ఈ సందర్భంగా ఎం.పి నాగరాజు మాట్లాడుతూకర్నూలు నుంచి బళ్లారి కి హైవే ఏర్పాటు చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటకలను అనుసంధానించడంలో కీలక పాత్ర పోషిస్తుందని , వాణిజ్యం , పర్యాటకం మరియు ప్రాంతీయ అభివృద్ధి ని సులభతరం చేస్తుందని కేంద్ర మంత్రి గడ్కరీకి వివరించానని తెలిపారు.. కర్నూలు టూ బళ్ళారి హైవే ఏర్పాటు చేయడంతో పాటు, బెంగళూరు టూ హైదరాబాద్ హైవే లో సిక్స్ లెన్ రోడ్ వేయాలని , అలాగే జిల్లా మీదుగా వెళ్తున్న సూరత్ టూ చెన్నై హైవే లో ఇన్ అండ్ ఔట్ సర్వీస్ రోడ్డులను ఏర్పాటు చేయాలని కోరానన్నారు .. దీని పై మంత్రి గడ్కరీ సానుకూలంగా స్పందించారని ఎం.పి నాగరాజు తెలిపారు.