మాదాసి.. మాదారి కురవలను ఎస్సీ కులగణన లో నుండి తొలగించాలని వినతి
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద: కర్నూలు జిల్లా హొళగుంద మండలం హెబ్బటం గ్రామంలో సచివాలయం సిబ్బంది వారికి, హెబ్బటం గ్రామం లో మాదాసి కురవలను మాదారి కురవలను ఎస్సీ కులగణన లో నుండి తొలగించాలని వినతి పత్రం అందజేసిన వివిధ ప్రజా సంఘాల నాయకులు . ఈ సందర్భంగా మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాల వన్నూరుప్ప , ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు పక్కిరప్ప మాదిగ , ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ కులగనన జాబితాను ఈ నెలలో గ్రామ వార్డు సచివాలయాల బోర్డులలో ప్రదర్శించిన జాబితా నుండి మాదాసి కురువ మా దారి కురవల పేరుతో నమోదైన పేర్లను తొలగించి ఎస్సీలకు న్యాయం చేయాలని అలాగే ఈ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం శ్రీకాకుళం జిల్లా,కర్ణాటక ప్రాంతంలో మహారాష్ట్రలో బెల్గాం లో మాత్రమే మాదాసి కురవలు ఉన్నారు. ఈ ప్రాంతంలో లేని మాదాసి కురవలకు మరియు మా దారి కురవలకు ఎస్సీ సర్టిఫికెట్లు జారీ చేయకూడదని డిమాండ్ చేశారు. అలాగే విశ్రాంత ఐఏఎస్ అధికారి జెసి శర్మ నివేదిక ప్రకారం 16 ఉపకులాలను తొలగించాలని అందులో ఈ మాదాసి కురవ మాదారి కురవలను ఎస్సీ జాబితాలో నుండి తొలగించాలని ఆయన 2020 సంవత్సరంలోనే ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు తెలిపారు. అలాగే కర్నూలు జిల్లా హొళగుంద మండలం హెబ్బటం గ్రామంలో మాదాసి కురవలను మాదారి కురవలను ఎస్సీ కుల గణన సర్వే నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు వన్నూరుప్ప , ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు పక్కిరప్ప , భీమేష్ మాదిగ, ముసలయ్య, కాదరప్ప, దేవారింటి చిన్న ఉలిగప్ప, హరిజన హనుమంతు ,పరుశురాముడు, గోసంగి పెద్ద ఈరన్నమరియు లింగంపల్లి శేషగిరి పాల్గొన్నారు.