మదాసికురువ/మదారికురువ కుల ధ్రువీకరణ పత్రాల జాప్యంపై ఆర్డీవో కు వినతి
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ : మదాసు కురువ/ మదారి కురువ ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రం ఇవ్వడంలో అధికారుల జాప్యంపై స్పందించాలని కోరుతూ ఆర్డీవో డాక్టర్ ఎస్ భరత్ నాయక్ కు మదాసి కురువ మదారి కురువ ఎస్సి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మంగళవారం వినతి పత్రం అందజేశారు. RDO పత్తికొండ క్యాంపు కార్యాలయంలో. ఈ విషయంపై ఆర్డీవో స్పందిస్తూ, సమస్య పరిష్కారం కోసం సంబంధిత జిల్లా అధికారులతో నివేదిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో నగరినాగభూషణం,జిల్లా గౌరవ అధ్యక్షులు నేరడుజల్లచంద్రశేఖర్, జిల్లా డైరెక్టర్ గొర్రెల మేకల పెంపకం దారుల సహకార సంఘం యూనియన్ ఉమ్మడి కర్నూలు జిల్లా మంకె కురువ లక్ష్మన్న, సంఘం సీనియర్ నాయకులు కురువ మోహన్(మారెళ్ళ)కురువ యుగంధర్, (M.అగ్రహారం)తదితరులు పాల్గొన్నారు.