మద్దిగుండం చెరువు నీళ్లు.. గ్రామాల్లో టెన్షన్
1 min readకలెక్టరేట్ ఎదుట ధర్నా.. కలెక్టర్ కు వినతి పత్రం
రెండు గ్రామాల రైతులకు న్యాయం చేస్తాం:డీఎస్పీ
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలోని జలకనూరు మద్దిగుండం చెరువు నీళ్ల విషయంలో జలకనూరు, సుంకేసుల గ్రామాల్లో గత రెండు రోజులుగా రైతుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది గ్రామాల్లో టెన్షన్ టెన్షన్ గా ఉన్న పరిస్థితి ఉంది. చెరువు నుండి సుంకేసుల రైతులు మోటర్ల ద్వారా నీళ్లను పొలాలకు వాడుకోకూడదు మోటర్లను తొలగించాల్సిందేనని జలకనూరు రైతులు పట్టుబడుతున్నారు.కాదు మా గ్రామ సరిహద్దులో కూడా ఈ చెరువు ఉంది ఎన్నో ఏళ్ల నుండి ఈ చెరువు నుండే మోటర్ల ద్వారా పొలాలకు నీళ్లు వాడుకుంటున్నామని సుంకేసుల రైతులు వారిపై మండిపడుతున్నారు. మంగళవారం ఉదయం నంద్యాలలో కలెక్టరేట్ ఎదుట సుంకేసుల గ్రామ రైతులు ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్ జి రాజకుమారి కి మరియు ఇరిగేషన్ అధికారికి రైతులు వినతిపత్రం అందజేసినట్లు వారు తెలిపారు.నిన్న సాయంత్రం ఆత్మకూరు డీఎస్పీ రామాంజినాయక్, నందికొట్కూరు రూరల్ సీఐ బీ ఆర్ కృష్ణయ్య,ఎస్సై జగన్ మోహన్ సుంకేసుల, జలకనూరు గ్రామాల్లో గ్రామ సభల ద్వారా రైతులకు అవగాహన కల్పించారు. ఇరువురు గ్రామాల రైతులుప్రస్తుతం పంటలు ఉన్నాయని రెండు గ్రామాల రైతులకు సమన్యాయం చేసే విధంగా చేస్తామని రెవెన్యూ విద్యుత్ ఇరిగేషన్ అధికారులు మరియు గ్రామాల పెద్దలు రైతులతో సమావేశంలో చర్చించి రైతులకు మంచి జరిగే విధంగా చేస్తామని డిఎస్పి రైతులకు హామీ ఇచ్చారు. అంతే కాకుండా చిన్న చిన్న విషయాలకు పెద్దగా చేసుకోవద్దని గొడవలు సృష్టిస్తే ఎవరైనా సరే కఠిన చర్యలు తప్పవని డిఎస్పీ హెచ్చరించారు.