ఘనంగా రాఘవేంద్రుని మధ్యారాధన
1 min readరమణియం రాఘవేంద్రుని స్వర్ణ రథోత్సవం
మూల బృందావనానికి వేయి లీటర్లతో పాలాభిషేకం, విశేష ఫల పంచామృతాభిషేకం
పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమెన మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్ర స్వామి 353 వ ఆరాధనోత్సవాలలో భాగంగా ఐదవ రోజు మధ్యారాధన శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ రాఘవేంద్రస్వామి మూల బృందావనానికి విశేష పూజలు నిర్వహించారు. రాఘవేంద్రుని స్వర్ణ రథోత్సవం వైభవంగా జరిగింది. రాఘవేంద్రస్వామి మధ్యరాధనను పురస్కరించుకుని రాఘవేంద్రస్వామి మూల బృందావనానికి పీఠాధిపతులు శ్రీ సుభుదేంద్రతీర్థులు స్వయంగా వేయి లీటర్ల పాలు, ఫల మహా పంచామృతాభిషేకం చేశారు. అనంతరం బృందావనాన్ని స్వర్ణ కవచాలతో పట్టు వస్త్రాలతో వివిధ రకాల పూల మాలలు వేసి సుందరంగా అలంకరించారు. నైవేద్య సమర్పణతో మంగళ హారతులిచ్చారు. మధ్యరాధన సందర్భంగా ఉత్సవ మూర్తి అయిన ప్రహ్లాద రాయులను స్వర్ణ రథం పై ఉంచి పీఠాధిపతులు సుభుదేంద్రతీర్థులు మంగళ హారతులు ఇచ్చిన అనంతరం మేళ తాళాలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీ మఠం ప్రాకారంలో భక్త జన సందోహం మధ్య స్వర్ణ రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రతిభా అవార్డు గ్రహీత పండితకేసరి మహా మహోపాద్యాయ బిరుదాంకితులు రాజా ఎస్ గిరియాచార్యులు పీఠాధిపతుల పూర్వాశ్రమ కుమారులు రాజా ఎస్ అప్రమేయచార్ ఎఎఓ మాధవ శెట్టి మేనేజర్లు ఎస్కే శ్రీనివాసరావు వెంకటేష్ జ్యోషి ఆధ్యాత్మిక అభివృద్ధి అధికారి శ్రీ పతి ఆచార్ అసిస్టెంట్ మేనేజర్ ఐపి నరసింహ మూర్తి సహయక పిఆర్వో హొన్నొళ్ళి వ్యాసరాజాచార్ ఇఇ సురేష్ కోనాపూర్ ద్వారపాలక అనంతస్వామి ప్రకాష్ రావ్ ఇతర మఠం సిబ్బంది పాల్గొనగా సిఐ రామాంజులు ఎస్సై గోపినాథ్ స్పెషల్ బ్రాంచ్ ఎస్సై వేణుగోపాల్ రాజు ఇతర సిబ్బంది తగిన భద్రత కల్పించారు.