వైసీపీకి మాదిగల గుణపాఠం తప్పదు
1 min readచంద్రబాబు గెలుపే లక్ష్యంగా మాదిగల పోరాటం
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: రాష్ట్రంలో వైసీపీకి మాదిగలు గుణపాఠం చెప్పాలని మే 13న జరుగనున్న సార్వత్రిక ఎన్నికలలో టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గెలుపే లక్ష్యమే మాదిగలు కంకణం కట్టుకొని పని చేయాలని జై మాదిగ సేవా సంఘం వ్యవస్థాపకుడు బెంజిమెన్ మాదిగ అన్నారు. శుక్రవారం నందికొట్కూరు పట్టణంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు గెలుపే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాలు తిరిగి టిడిపి గెలిపే మాదిగల గెలుపు దిశగా జై మాదిగ సేవా సంఘం మాదిగ ఉపకులాలను కలుపుకుని పనిచేస్తుందన్నారు. అదేవిధంగా నందికొట్కూరు నియోజకవర్గంలో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి జయసూర్యను గెలిపించుకోవడం కోసం మాదిగలు పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మాదిగలకు బహుమతిగా నందికొట్కూరును చంద్రబాబు నాయుడు ఇచ్చారని నందికొట్కూరులో టిడిపి అభ్యర్థి జయ సూర్య ను గెలిపించుకొని చంద్రబాబు నాయుడుకు బహుమతిగా ఇవ్వాలని మాదిగ ఉపకులాలకు పిలుపునిచ్చారు. వర్గీకరణ విషయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నోరు మెదపడం లేదన్నారు. రాష్ట్రంలో దళితులకు రక్షణ లేదన్నారు.దళితుల పథకాలను అమలు చేయకుండా రద్దు చేశారని విమర్శించారు. రాష్ట్రంలో 29 ఎస్సీ నియోజకవర్గాలు ఉంటే మాదిగలకు 10 స్థానాలు కేటాయించి వైసీపీ మాదిగలను అవమానించారని అన్నారు.టీడీపీ మాదిగలకు సీట్ల కేటాయింపులో న్యాయం చేసిందని తెలిపారు. మే 13 న జరిగే ఎన్నికల లో వైయస్ జగన్మోహన్ రెడ్డికి మాదిగల సత్తా అంటే ఏమిటో చూపిస్తామన్నారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు వర్గీకరణకు మద్దతు తెలిపినందుకు ఆయనకు రాష్ట్రవ్యాప్తంగా ఎన్డీఏ కూటమికి మా మద్దతు తెలియజేస్తున్నామన్నారు. కాబట్టి నందికొట్కూరు నియోజవర్గంలో టిడిపి అభ్యర్థి జయ సూర్యకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని మాదిగ ఉపకులాలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జై మాదిగ సేవా సంఘం నియోజవర్గ అధ్యక్షులు ఏసేపు, సోషల్ మీడియా జిల్లా అధ్యక్షుడు సంపత్,కొత్తపల్లి మండల అధ్యక్షుడు రాజు,జూపాడుబంగ్లా మండల అధ్యక్షుడు వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.