కన్నుల పండువగా రామలింగేశ్వరుడి మహా రథోత్సవం
1 min readజనసంద్రంగా మారిన రాంపురం
భక్తులతో కిటకిటలాడిన పురవీధులు
జాతరకు వచ్చిన ప్రముఖు
ఎక్కడ చూసినా ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఫ్లేక్సిలు
పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం : మండల పరిధిలోని రాంపురం గ్రామంలో పవిత్ర తుంగభద్ర నది ఒడ్డున వెలసిన శ్రీ రామలింగేశ్వర స్వామి మహా రథోత్సవం బుధవారం ఆలయ ధర్మకర్తలు టిటిడి పాలకమండలి మాజీ సభ్యులు వై సీతారామి రెడ్డి, ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, ప్రదీప్ రెడ్డి అధ్వర్యంలో కన్నుల పండువగా నిర్వహించారు. ముందుగా ఉత్సవమూర్తి రామలింగేశ్వరుడికి గ్రామోత్సవం నిర్వహించి ధర్మకర్తల ఇంటి వరకు వైభవంగా ఉత్సవమూర్తి ని ఉరేగించారు. అక్కడ స్వామి వారి కి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులిచ్చి పల్లకిలో ఆలయం వరకు ఊరేగింపు గా తీసుకుని వచ్చారు. అనంతరం అర్చకులు వేదపఠనాలు గావిస్తూ మహా రథం పై కొలువుంచి యాత్ర కు అంకురార్పణ పలికారు.. శివనామస్మరణ పఠిస్తూ భక్తులు రథం గొలుసులను చేతబూని రథాన్ని ముందుకు లాగారు. ఆలయం నుంచి 100 మీటర్లు మేర రథాన్ని లాగి తిరిగి యథాస్థానానికి చేర్చారు.. వేలాదిగా భక్తులు కర్ణాటక, తెలుగు రాష్ట్రాల ప్రజలు అధిక సంఖ్యలో తరలి రావడంతో రాంపురం క్షేత్రం రద్దీగా గా మారింది. జాతర లో చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు, ఆదోని, పత్తికొండ, ఆలూరు,గుంతకల్లు, ఉరవకొండ నియోజకవర్గంలోని ఆయా గ్రామాల ప్రజలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున తరలి వచ్చి టీటీడీ పాలకమండలి సభ్యులు వై. సీతారామి రెడ్డి, ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి, కి, వైకాపా నేత వై. ప్రదీప్ రెడ్డి కి పూలమాలలు వేసి శాలువ కప్పి ఘనంగా సన్మానించారు.
హాజరైన ప్రముఖులు:
శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర మహోత్సవంను పురస్కరించుకుని రథోత్సవ కార్యక్రమానికి వైకాపా జిల్లా అధ్యక్షులు ఎస్వీ. మోహన్ రెడ్డి, అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్సీ వై. శివరామిరెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే విరుపా క్షి, ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయిప్రసాద్ రెడ్డి, వై. మనోజ్ రెడ్డి, వై. భీమారెడ్డి, తెర్నేకల్ సురేంద్ర రెడ్డి తో పాటు జడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ లు, సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, మాజీ ప్రజాప్రతినిధులు, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు శ్రీ రామలింగేశ్వర స్వామి ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళ హారతి ఇచ్చి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకొని మహా రథోత్సవం లో పాల్గొన్నారు.
70 మందితో పోలీసు బందోబస్తు :-
శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర మహోత్సవ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కోసిగి సీఐ మంజునాథ్, ఎస్ఐ లు విజయ్ కుమార్, చంద్రమోహన్, నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో 70 మంది పోలీసు సిబ్బంది తో బందోబస్తు నిర్వహించారు.