PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహానంది…విద్యుత్ సరఫరా కు అంతరాయం

1 min read

పల్లెవెలుగు వెబ్ మహానంది:  మహానంది మండలంలోని వివిధ సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ సరఫరా కు శనివారం అంతరాయం ఏర్పడనున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. తిమ్మాపురం, బుక్కాపురం, గాజులపల్లె సబ్ స్టేషన్ పరిధిలో 33 కెవి మెయింటినెన్స్ కారణంగా విద్యుత్తును శనివారం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిలుపుదల చేస్తున్నట్లు తెలిపారు. రైతులకు అందించే త్రీ ఫేస్ విద్యుత్తును శుక్రవారం 12 గంటల నుండి శనివారం ఉదయం 9 గంటల వరకు సరఫరా చేయనున్నట్లు తెలిపారు. మహానంది క్షేత్రానికి మాత్రం కార్తీక మాసం సందర్భంగా విద్యుత్ సరఫరాలో ఎలాంటి మార్పులు ఉండవన్నారు. బొల్లవరం సీతారామపురం ,మసీదుపురం గ్రామాలకు సంబంధించి విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా యధావిధిగా కొనసాగుతుందన్నారు. దీనికి కారణం నంద్యాల విద్యుత్ సబ్స్టేషన్ ల పరిధిలో ఉండటంవల్ల ఆ గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉండదన్నారు. 

About Author