ఆ భూములకు మహానందీశ్వరుడే యజమాని. ..
1 min readపల్లెవెలుగు వెబ్ మహానంది: ఆ భూములకు మహానందీశ్వరుడే యజమాని అని రెవెన్యూ వర్గాలు పేర్కొంటున్నాయి. మహానందీశ్వర స్వామి దేవస్థానానికి చెందిన వ్యవసాయ భూమి మండలంలోని తమ్మడపల్లె రెవెన్యూ పరిధిలో దాదాపు పది ఎకరాలు ఉన్నట్లు రెవెన్యూ మరియు ఆలయ వర్గాలు గుర్తించాయి. సర్వే నెంబరు 303 నందు 8.74 మరియు 314 నందు1.28 ఎకరాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. సదరు భూములను అనకల మరియు కుమ్మర వారికి సర్వీస్ ఇనాం కింద గతంలో దేవస్థానం వారు ఇచ్చినట్లు పేర్కొన్నారు. కానీ ఈ భూములకు మేమే యజమానులమని వాటికి సంబంధించి పట్టాదారు పాసు పుస్తకాలు సృష్టించడమే కాక బ్యాంకుల్లో మార్ట్ గేజ్ చేసి రుణాలు పొందినట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. నిజానికి సదరు భూములు కు సంబంధించి ఈనామ్ సర్వీస్ దారులు కేవలం ఆ భూముల్లో ఫల సహాయం మాత్రమే సేకరించుకోవాల్సి ఉంటుంది. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఆర్ ఎస్ ఆర్ మహానందీశ్వర స్వామి దేవస్థానం యజమానిగా ఉన్నట్లు రెవెన్యూ రికార్డుల్లో నమోదయి ఉన్నట్లు రెవెన్యూ వర్గాలు పేర్కొన్నాయి. ఆలయ అధికారులు చట్టపరంగా చర్యలు తీసుకోవడంతో పాటు ఆ భూమిని స్వాధీనంలోకి త్వరలో తీసుకోనున్నట్లు సమాచారం. సదరు భూములకు సంబంధించి పట్టాదారు పాసుపుస్తకాలు మరియు బ్యాంకులో రుణాలు పొందడానికి ఒక ప్రజా ప్రతినిధి కీలక భూమిక పోషించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సదస్సులో బండారం బయటపడినట్లు విశ్వాసనీయ సమాచారం. ఇంతకు పట్టాదారు పాసుపుస్తకాలు పొందడానికి భారీ మొత్తంలో చేతులు మారినట్లు ఆరోపణలు , విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజా నిజాలు మహానందీశ్వరునికే ఎరుక.