మహనీయులు పెరియార్ జయంతి…
1 min readపెరియార్ సిద్ధాంతం అమలు చేస్తేనే రాష్ట్రంలో బీసీ కులాలకు రాజ్యాధికారం, మనుగడ
రిటైర్డ్ డీజీపీ మరియు బీఎస్పీ ఏపీ కోఆర్డినేటర్ డా పూర్ణచంద్రరావు
పల్లెవెలుగు వెబ్ మదనపల్లి: పెరియార్ ఐడియాలజీ అంటూ నలభై యేండ్ల క్రితం పుట్టుకొచ్చిన తెలుగు దేశం పార్టీ, బీసీలకు ఎటువంటి న్యాయం చేయకుండా, కేవలం ఒక కుల పార్టీగా నిలిచిపోయిందని, బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ డా పూర్ణచంద్ర రావు అభిప్రాయపడ్డారు. మహనీయులు పెరియార్ జయంతిని పురస్కరించుకుని, మంగళవారం, మదనపల్లిలో బీఎస్పీ నిర్వహించిన బీసీ అసీంబ్లీలో మాట్లాడుతూ వారు ఇలా అన్నారు: “స్వాత్రంత్య్రం వచ్చిననాటి నుండి ఇప్పటివరకు 2902 MMమంది ఎమ్మెల్యేలు అయ్యారు ఇప్పటి ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతంలో. కానీ వీరందరిలో ఎక్కువ శాతం ఉన్నది, అటు రెడ్లు, ఇటు కమ్మవాళ్ళు. జనాభా దామాషాప్రకారం, 50 శాతం పైగా ఉన్న బీసీ కులాలకు ఈ పార్టీలు ఎన్ని టిక్కెట్లు ఇచ్చారో వేళ్ళ మీద లెక్కించచ్చు. ముందు ఏకకుల పాలన, తరువాత ద్వికుల పాలనలో రాష్ట్రం మగ్గిపోతోంది.దీనికి విరుగుడు కులగణన ఒక్కటే. మొన్నటిమొన్న చంద్రబాబు బీసీ డిక్లరేషన్ అంటూ, చట్టసభల్లో బీసీలకు 33 శాతం అంటూ, స్థానిక సంస్థల్లో 34 శాతం అంటూ శుష్క వాగ్దానాలు చేసారు. వీటి అమలు సాధ్యం కులగణనతోనే. ఏ కులంవారికి ఎన్ని సీట్లు ఇవ్వాలో తేలాలంటే కులగణనతోనే కుదురుతుంది. ఇన్ని రంగాలమీద శ్వేతా పత్రాలు ఇస్తున్న చంద్రబాబు, మరి మొన్న జగన్ చేయించిన క్యాస్ట్ సెన్సస్ బయటపెట్టి, మరింత పటిష్టంగా కులగణనను ఉపక్రమించచ్చు కదా? నేటి పెరియార్ జయంతి నాడు, ఆ మహానుభావుని స్పూర్తితో తమిళనాడు రాజకీయాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాలందరూ రాజకీయ ప్రాధాన్యత, స్వేచ్ఛ అనుభవిస్తున్నారు. మరి మన రాష్ట్రంలో ఇది సాకారం కావాలంటే, వెంటనే కులగణన చేపట్టాలి, బీసీ చట్టాలు అమలు చెయ్యాలి. లేకపోతే ఈ రెండు పార్టీలకు మనం ఓటు వెయ్యకూడదు. రెండు మోసం చేసే పార్టీలే. ఎదురు బీసీలను బీసీల మీద, ఎస్సీలను ఎస్సీల మీద రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్న పార్టీలే. రాయలసీమలో ఒక రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం తీసుకోండి. స్వత్రంత్రం నుండి ఇప్పటివరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 119 ఎమ్యెల్యేలు ఎన్నికకాగా అందులో 66 మంది రెడ్లే. కమ్మవాళ్ళు ఇందులో 6, బలిజలు 14, ముస్లింలు 6, అంబెడ్కర్ గారి చలవవలన ఎస్సీలు 18 కాగా, బీసీలు కేవలం ఇద్దరు మాత్రమే, ఒకరు గాండ్ల, ఒకరు యాదవ కులం వారు. రెడ్లు తప్ప ఈ నియోజకవర్గాల్లో ఇంకెవరు ఎమ్మెల్యేలు కారా? రాయలసీమలో ఎస్టీల పరిస్థితి మరీ దారుణం. నెల్లూరు కలిపి గ్రేటర్ రాయలసీమలో ఒక ఎస్టీ ఎమ్యెల్యే కాకపోవటం న్యాయమా? ఇది ఎంత దారుణం “అంతకుముందు, స్థానిక టమాటో మార్కెట్ వద్ద గలా మహాత్మా జ్యోతిబా ఫూలే విగ్రహానికి బీఎస్పీ నేతలు నివాళులర్పించారు. అటుతర్వాత ఫూలే విగ్రహం నుండి బీసీ అసెంబ్లీ వేదిక వరకు, బీఎస్పీ నేతలు తరలివెళ్లారు.