సి సి రహదారులకు మహర్దశ..
1 min readఎమ్మెల్యే గౌరు చరిత చొరవతో గ్రామాలలో అభివృద్ధి పరుగులు..
పల్లెవెలుగు వెబ్ గడివేముల: టిడిపి ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు కాకముందే దాదాపు మండల వ్యాప్తంగా సీసీ రోడ్ల నిర్మాణానికి మూడున్నర కోట్లు కేటాయించినట్లు సమాచారం . ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారంలో వస్తేనే రాష్ట్ర వ్యాప్తంగా అస్తవ్యస్తంగా ఉన్న రహదారులపై సమీక్ష నిర్వహించి నిధులు విడుదల చేస్తామని ప్రకటించారు ఇచ్చిన మాట ప్రకారం రహదారులపై దృష్టి పెట్టారు. గత నెల అసెంబ్లీ సమావేశాలకు హాజరైన పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు విడుదల చేయాలని సీఎం దృష్టికి తీసుకువెళ్లడంతో స్పందించి నియోజకవర్గానికి నిధులు మంజూరు చేశారు. దీంతో పంచాయతీరాజ్ శాఖ ఏఈ మండల వ్యాప్తంగా అవసరం ఉన్నచోట సిసి రోడ్ల నిర్మాణానికి సర్వే చేస్తున్నారు. సోమవారం నాడు దుర్వేసి గ్రామం నందు తుము శివనాగిరెడ్డి ఇంటి నుండి మంజలి నారాయణమ్మ ఇంటి వరకు ఉపాది హామీ పథకం నిధులతో సీసీ రోడ్డు నిర్మాణం అంచనా వేశారు ఈ కార్యక్రమంలో కృష్ణయాదవ్, శ్రీనివాసులు యాదవ్, కృష్ణారెడ్డి మరియు ఏ ఈ పి ఆర్,ఇంజనీరింగ్ అసిస్టంట్ పాల్గొన్నారు .