PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పెద్దహ్యట గ్రామంలో ఆదికవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : హోళగుంద మండలం పెద్దహ్యట గ్రామంలో రామాయణ సృష్టికర్త ఆది కవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా పెద్దహ్యట బోయ కాలనీలో శ్రీ.వాల్మీకి మహర్షి నూతన బోర్డును ఏర్పాటు చేసి శ్రీ.వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలు వేసి ప్రత్యేక పూజలు వేసి ఆదికవి శ్రీ.వాల్మీకి మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది.అదేవిధంగా మండల ప్రాథమిక పాఠశాలలో కూడా జిల్లా ఉన్నంత విద్య అధికారుల ఆదేశాల మేరకు ఆదికవి శ్రీ వాల్మీకి మహర్షి జయంతిని విద్యార్థులు ఉపాధ్యాయులు వాల్మీకి పెద్దలు యువకులు ఆధ్వర్యంలో శ్రీ వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలు వేసి పూజలు చేసి జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా వాల్మీకి పెద్దలు వాల్మీకి యువకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రామాయణ సృష్టికర్త శ్రీ.ఆదికవి వాల్మీకి మహర్షి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం అని వారన్నారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ ప్రవేట్ విద్యాసంస్థలలో కూడా శ్రీ వాల్మీకి మహర్షి జయంతి ఘనంగా నిర్వహించాలని జిల్లా ఉన్నంత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం చాలా గర్వించద విషయం అని అన్నారు అదేవిధంగా బోయ వాల్మీకుల చిరకాల కోరిక బోయలను ఎస్టీ రిజర్వేషన్ కోసం స్వాతంత్రం వచ్చినప్పుడు నుండి పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు కాబట్టి ఇప్పుడైనా కూటమి ప్రభుత్వంలో బోయ వాల్మీకులను గుర్తించి ఎస్టీ రిజర్వేషన్ కల్పించాల్సిందిగా వారు కోరారు.ఈ కార్యక్రమంలో వాల్మీకి పెద్దలు పులికొండ రంగస్వామి పులి వీరభద్ర బెలగల్ నాగరాజ్ కట్టే తిమ్మయ్య కట్టే నాగప్ప తోట మారెప్ప వాల్మీకి యువకులు శ్రీరంగ తలారి మల్లయ్య బుల్లయ్య గారి రాము  గిర్రప్ నాగరాజ్ పులి మల్లయ్య నాగప్ప గోపాల్ వీరేష్ మల్లి అనిమేష్ తిరుపతి నాగేంద్ర వెంకటేష్ కృష్ణ మల్లికార్జున రాజు వాల్మీకి కుల బాంధవులు  తదితరులు పాల్గొన్నారు.

About Author