జిల్లా ఎస్పీ ఆదేశాలతో ఏలూరులో మహిళా రక్షణ దళం గస్తీ నిర్వహణ
1 min readమహిళ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎం సుబ్బారావు, మహిళా ఎస్సై కాంతిప్రియ
ఆటోలలో పట్టణానికి వచ్చే వంటరి మహిళలకు రక్షణ కల్పించాలి
ఆకతాయిలు బాలికలను వేధింపులకు గురి చేస్తే 112 నెంబర్ కు డైల్ చేయాలి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్, ఏలూరు డిఎస్పి డి శ్రావణ్ కుమార్ యొక్క ఆదేశాలపై ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎం సుబ్బారావు, మహిళా పోలీస్ స్టేషన్ మహిళా ఎస్సై కాంతి ప్రియా మరియు వారి యొక్క సిబ్బందితో కలిసి అభయ మహిళా రక్షక దళం గస్తీ నీ ఏలూరు పట్టణంలో నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏలూరు న్యూ బస్టాండ్ వద్ద ఆటో డ్రైవర్ లతో మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుండి మహిళలు ఏలూరు పట్నానికి వచ్చే సందర్భంలో ఆటోలలో ప్రయాణం చేస్తూ ఉంటారని ఒంటరి మహిళలకు భద్రత, రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఆటో డ్రైవర్ లకు కలిగి ఉండాలని అన్నారు. ఎవరైనా ఆకతాయిలు ఆటోలలో మహిళలు బాలికలు ప్రయాణించే సమయాలలో వేధింపులకు గురి చేస్తే వెంటనే డయల్ 112 కు ఫోన్ చేసి తెలియచేయాలని,ఆటో డ్రైవర్లు ఎవరైనా ఆకతాయి వేదింపులకు మహిళలను గురి చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, ఎన్ఆర్ పేట ఏలూరు వన్ టౌన్ కస్తూరిబాయ్ స్కూల్ తదితర ప్రాంతాలలో సాహితికమైనటు వంటి కారణాలు లేకుండా రోడ్లపై తిరుగుతున్న విద్యార్థులను గమనించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించినారు.ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ విద్యార్థులు పై ఎటువంటి క్రిమినల్ కేసులు నమోదు చేసిన యెడల వారి యొక్క బంగారు భవిష్యత్తును నాశనం అవుతుందని భవిష్యత్తులో వారికి ఉద్యోగ అవకాశాలను కోల్పోతారని విదేశాలకు వెళ్లాలన్న పాస్ పోర్ట్ రాకుండా ఉంటాయని సరదాగా చేసే పనులు మీ పాలిట యమపాసాలుగా మారతాయని తల్లిదండ్రుల ఆశయ సాధన కొరకు చిత్త శుద్ధితో చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అభయ రక్షక మహిళా సిబ్బంది సూచించారు.