మెజార్టీ ప్రజా మద్దతు కూటమికే ఉంది
1 min readరానున్న ఎన్నికల్లో టిడిపికి విజయం తథ్యం
సీనియర్ వైసీపీ నాయకుడు ఆర్ఎంపీ డాక్టర్ ఎరకల సాంబశివరావు టిడిపిలో చేరిక
భారీ సంఖ్యలో టిడిపిలో చేరిన పార్టీ శ్రేణులు,ఆయన అభిమానులు, కార్యకర్తలు
టిడిపి, బిజెపి, జనసేన కూటమి అభ్యర్థి బడేటి చంటి ధీమా వ్యక్తం
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : మెజార్టీ ప్రజా మద్దతు కూటమికే ఉందని, రానున్న ఎన్నికల్లో ఘన విజయం తథ్యమని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టిడిపి, జనసేన, బీజేపి కూటమి ఉమ్మడి అభ్యర్ధి బడేటి చంటి స్పష్టం చేశారు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో టిడిపిలోకి చేరికల పర్వం జోరందుకుంది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులుకదుపుతున్న ఆ పార్టీ నేతలు కలిసి వచ్చే ప్రతిఒక్కరినీ కలుపుకుంటూ ముందుకెళ్తున్నారు. టిడిపి విజయం తద్యమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదేక్రమంలో ఆ పార్టీకి ఏలూరు నియోజకవర్గంలో మరింత ఆదరణ లభిస్తోండడంతో ఆశావహులంతా ఆ పార్టీలో చేరేందుకు సిద్దమైపోతున్నారు. తాజాగా ఏలూరు 16వ డివిజన్‌కు చెందిన వైసిపి సీనియర్ నాయకులు ఆర్ఎంపి డాక్టర్ వై సాంబశివరావు ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు కూటమి ఉమ్మడి అభ్యర్ధి బడేటి చంటి సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్ధం పుచ్చుకొనేందుకు పెద్ద ఎత్తున ప్రజలు బారులు తీరారు. వీరందరికీ పార్టీ కండువాలు కప్పిన బడేటి చంటి సాదరంగా వారందరినీ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో గెలుపును భారీ మెజార్టీతో సాధించేందుకు ప్రత్యేక ప్రణాళికలతో అందరినీ కలుపుకుంటూ ముందుకెళ్తున్నామన్నారు. స్థానిక నేతగా డాక్టర్ సాంబశివరావుకు ఉన్న ప్రజా మద్దతు గొప్పదని, ప్రజల కష్టనష్టాల్లో ఆయన భాగస్వామ్యమైన తీరు ఆదర్శనీయమన్నారు. 55యేళ్ళ సుదీర్ఘ రాజకీయ ప్రస్తానం కలిగిన నేత తమతో కలిసి నడిచేందుకు సిద్దమయ్యారంటే వైసిపి అరాచక పాలనపై ఆయనకొచ్చిన విసుగు, విరక్తి ఏంటో అర్ధం చేసుకోవాలన్నారు. డాక్టర్ సాంబశివరావు మాట్లాడుతూ సేవలు మరింత విస్త్రృతం చేయడంతో పాటూ ఆ సేవలు స్వేచ్ఛగా నిర్వర్తించే విషయంలో టిడిపి నుండి వస్తోన్న ఆదరణ అత్యధికంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. తొలుత బడేటి చంటి స్థానిక నాయకులు, ప్రజలు అపూర్వస్వాగతం పలికారు. పుష్పగుచ్చాలు, పూలమాలలతో తమ అభిమానాన్ని చాటుకున్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కర్రి శ్రీనివాస్, బీజేపి నాయకులు గాది రాంబాబు తదితరులు పాల్గొన్నారు.