ఏ ఐ ఎస్ ఎఫ్ 49వరాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి
1 min readఏఐఎస్ఎఫ్ 49వ రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్స్ ఆవిష్కరించిన ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి యస్ షాబీర్ భాష
పల్లెవెలుగు న్యూస్ ఎమ్మిగనూరు: పట్టణంలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ 49 వ రాష్ట్ర మహాసభలు విజయనగరంలో నవంబర్ 27 నుంచి 30వ తేదీ వరకు జరుగుతున్న తరుణంలో ఎమ్మిగనూరు పట్టణంలో నందు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు ఏఐఎస్ఎఫ్ 49వ రాష్ట్ర మహాసభల గోడ పత్రికలు విడుదల చేశారు. ఈ పోస్టర్ ఆవిష్కరణకు ముఖ్య అతిధిగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి యస్ షాబీర్ భాష, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విజేంద్ర హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని, బ్రిటిష్ పాలకులను ఈ దేశం నుంచి తరిమి కొట్టాలని లక్ష్యంతో, స్వాతంత్ర సంగ్రామ పోరాటంలో పాల్గొన్న ఏకైక విద్యార్థి సంఘం అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్ ) 49వ రాష్ట్ర మహాసభలకు విజయనగరం వేదిక కానుందని తెలిపారు. విద్య ప్రైవేటీకరణ కార్పొరేటీకరణ కాషాయకరణకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి లోకం ఉద్యమాలకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ విద్యారంగ సమస్యలు పరిష్కారానికి శ్రీకారం చుట్టాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం విద్యను పూర్తిగా కాషాయీకరణ చేసే పద్ధతులలో జాతీయ నూతన విద్యా విధానం వల్ల ఇప్పటికే రాష్ట్రంలో చాలా విద్యాసంస్థలు మూతబడడం కూడా జరిగిందని తక్షణమే జాతీయ నూతన విద్యా విధానం రద్దు చేయాలన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికలలో విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు.యువగలం పాదయాత్రలో ప్రస్తుత విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని వెంటనే అమలు పరచాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటు చేయడం వల్ల చాలామంది విద్యార్థులు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు అదేవిధంగా ఉన్నత చదువులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77ను రద్దు చేయాలన్నారు.వైద్య విద్యను పేదలకు దూరం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైద్య విద్యను ప్రైవేటీకరణ చేస్తున్న జీవో నెంబర్ 107 108 రద్దు చేస్తామని ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం మాట నిలబెట్టుకొని జీవో నెంబర్ 107 108 రద్దు చేయాలని డిమాండ్ చేశారు . రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ విద్యాసంస్థలలో ఖాళీగా ఉన్న బోధనేతర పోస్టులు భర్తీ చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ బిసి, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ హాస్టల్ విద్యార్థుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. జైలు జీవితాలు అనుభవిస్తున్న ఖైదీలకు రోజుకు 100 రూపాయలు పైగా రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుంది కానీ నేటి విద్యార్థులే రేపటి దేశ భవిష్యత్తును తీర్చేదిద్దే హాస్టల్ విద్యార్థులకు కేవలం 52 రూపాయలు మాత్రమే కేటాయించడం బాధాకరమన్నారు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలను 3000 రూపాయలకు పెంచాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ హాస్టల్ భవనాలు కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న వాటిని గుర్తించి తక్షణమే సొంత భవనాలు నిర్మించాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వ హాస్టల్లో అద్దె భవనాలలో నిర్వహిస్తూ లక్షల రూపాయలు అద్దెలు కడుతున్నారు కానీ వాటికి సొంత భవనాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులకు మెస్ చార్జీలు కాస్మోటిక్ చార్జీలు విడుదల చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యా రంగంలో ఉన్న సమస్యలపై విజయనగరంలో జరుగుతున్న మహాసభలలో సుదీర్ఘంగా నాలుగు రోజులపాటు చర్చించి భవిష్యత్తు కార్యాచరణకు ఈ మహాసభలు వేదిక కానుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు రంగస్వామి, పట్టణ కార్యదర్శి అబ్దుల్ ఖాదర్, శంకర్,మోహన్, వీరేష్,రవి,సురేష్, సమీర్ తదితరులు పాల్గొన్నారు.