జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్రను విజయవంతం చేయండి
1 min readడిసిసి అధ్యక్షులు పి మురళీకృష్ణ
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్రను విజయవంతం చేయాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మాజీ సభ్యులు పి మురళి కృష్ణ కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన జిల్లాస్థాయి సమీక్ష సమావేశంలో మురళీకృష్ణ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ని కేంద్రమంత్రి అమిత్ షా పార్లమెంటులో చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ అతను వెంటనే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని కోరుతూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపుమేరకు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీమతి వైయస్ షర్మిల రెడ్డి ఆదేశాల మేరకు ఈనెల 22వ తేది దేశవ్యాప్త పాదయాత్రలో భాగంగా కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టబోయే పాదయాత్రలో కాంగ్రెస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మురళీకృష్ణ కాంగ్రెస్ శ్రేణులను కోరారు. ఈ పాదయాత్ర 22వ తేదీ ఉదయం 10:30 నిమిషాలకు జిల్లా పార్టీ కార్యాలయం నుండి ప్రారంభమై నెహ్రూ రోడ్, చౌక్ బజార్, గడియారం హాస్పిటల్, పెద్ద మార్కెట్ మీదుగా పాత బస్టాండు వద్దగల అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకొని అక్కడ మీటింగ్ జరుగునని తెలియజేశారు. కనుక ఈ పాదయాత్రకు కర్నూలు జిల్లా నందలి సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కర్నూలు జిల్లా నందలి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల కాంగ్రెస్ కోఆర్డినేటర్లు అనుబంధ సంస్థలయిన జిల్లా మహిళా కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ సేవాదళ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ సెల్ లీగల్ సేల్ ఐఎన్టియుసి ఎన్ ఎస్ యు ఐ డాక్టర్ సెల్ కిసాన్ సెల్ కల్చరల్ సెల్ నాయకులు మండల కాంగ్రెస్ అధ్యక్షులు, కార్యకర్తలు, అంబేద్కర్ గారి అభిమానులు శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో ఈ పాదయాత్రలో పాల్గొని విజయవంతం చేయవలెనని మురళీకృష్ణ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మూలింటి మారెప్ప మాజీ ఎమ్మెల్సీ ఎం సుధాకర్ బాబు సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ జిలాని భాష నియోజక వర్గాల కోఆర్డినేటర్లు ఎం కాసింవలి, బి క్రాంతి నాయుడు, చిప్పగిరి లక్ష్మీనారాయణ, పి మురళీకృష్ణరాజు ఓబీసీ జిల్లా చైర్మన్ డివి సాంబశివుడు ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు బి బతుకన్న జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ సుంకన్న కాంగ్రెస్ నాయకులు దేవిశెట్టి ప్రకాష్ ఎన్ సి బజారన్న ఎస్ ప్రమీలమ్మ ఏ వెంకట సుజాత షేక్ ఖాజా హుస్సేన్ ఖాద్రి పాషా, అనంతరత్నం మాదిగ సయ్యద్ నవీద్, అమనుల్లా ఈ లాజరస్ యజాస్ అహ్మద్ షేక్ మాలిక్ బి సుబ్రమణ్యం డబ్ల్యూ సత్యరాజు వెల్దుర్తి శేషయ్య తుగ్గలి రవి ఆర్ విక్టర్ జోసెఫ్ నోయల్ జాన్ సదానందం రమేష్ వశీ భాష ఐ ఎన్ టి యు సి ఆర్ ప్రతాప్ ఆనందం ఆశీర్వాదం నడిపిన్న రంగస్వామి మహిళా కాంగ్రెస్ మల్లేశ్వరి శ్రీలత అయ్యమ్మ మొదలగు వారు పాల్గొన్నారు.