రిలే దీక్షలు జయప్రదం చేయండి… ఏఐఎస్ఎఫ్
1 min readరాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 27,28,29 న కలెక్టరేట్ ఎదుట రిలే దీక్షలు…..
ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి విజేంద్ర
పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు పట్టణంలో సాంఘిక సంక్షేమ హాస్టల్ల సమస్యల పరిష్కారానికై ఈనెల 27,28,29 తేది లలో రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ నందు రిలే దీక్షలు జయప్రదం చేయాలని అఖిల భారత విద్యార్థి సమైఖ్య (ఏఐఎస్ఎఫ్) జిల్లా సహాయ కార్యదర్శి విజేంద్ర డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక సిపిఐ కార్యాలయలో నందు సమావేశంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సి,ఎస్టి బీసీ మైనారిటీ హాస్టల్స్ లో విద్యార్థులకు పెండింగ్లో ఉన్నటువంటి మెస్, కాస్మోటిక్ చార్జీలు, ట్రాంకు పెట్టెలు,మరియు ఖాళీగా ఉన్న కుక్ కామాటి,వార్డెన్ పోస్టులు భర్తీ చేయాలని, హాస్టల్ కు సొంత భవనాలు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా మూతబడిన హాస్టల్స్ పున ప్రారంభించాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన దీక్షలకు పిలుపునివ్వడం జరిగిందన్నారు, అందులో భాగంగా కర్నూలు జిల్లాలో కూడా 27వ తేదీన జరిగే నిరసన దీక్షను విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి పాఠ్యపుస్తకాలను పంపిణీ చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్నం భోజనం పథకాన్ని యధావిధిగా కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ పట్టణ కార్యదర్శి అబ్దుల్ ఖాదర్, నరసింహులు, రవి, సురేష్, తదితరులు పాల్గొన్నారు.