PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మెగా( పి.టి.యం.)సమావేశాన్ని జయప్రదం చేయండి

1 min read

పాఠశాల హెచ్ఎం భ్రమరాంబ

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ:  రాష్ట్రవ్యాప్త కార్యక్రమాల్లో భాగంగా ఈనెల 7వ తేదీన పత్తికొండ జిల్లా పరిషత్ బాలికలు ఉన్నత పాఠశాలలో “తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మెగా సమావేశం” (పిటిఎం) నిర్వహిస్తున్నాము అని ఈ సమావేశానికి పిల్లల తల్లిదండ్రులు హాజరై జయప్రదం చేయాలని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భ్రమరాంబ కోరారు. ఈ సందర్భంగా పత్తికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ కే.ఈ. శ్యాంబాబుకు  ఆహ్వాన పత్రిక ఇచ్చి పాఠశాల హెచ్ఎం భ్రమరాంబ  ,పాఠశాల చైర్మన్ రామాంజనేయులు, మీరా హుస్సేన్ , పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థిని లు ఆయన  ఆఫీస్ కు వెళ్లి ముఖ్య అతిథిగా పాల్గొనాలని ఆహ్వానించారు.ఆతర్వాత హెచ్.యం. భ్రమరాంబ పాఠశాల విద్యార్థినులకు ఆహ్వాన పత్రాలు ఇచ్చి వారితల్లి దండ్రులను తప్పకుండా ఈ సమావేశానికి పిలుచుకొని రావాలని చెప్పారు.పిల్లల తల్లిదండ్రులు ఈ మెగా సమావేశంకు హాజరై విజయవంతం చేయాలని కోరారు.తల్లి తండ్రులు హాజరై,సమావేశంలో పాల్గొని పాఠశాల పురోభివృద్ధికి తగిన సూచనలు సలహాలు ఇవ్వాలన్నారు పిల్లల విద్యా ప్రగతికి ,వారి వికాసానికి సహాయ సహకారాలు కూడా అందించాలని కోరారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *