ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రూపంతో రోబో తయారీ
1 min readమైక్రో స్ట్రక్చర్ డాక్టర్ బారికి చంద్రశేఖర్ విన్నుత్న ప్రయోగం
మరోసారి లిమ్కా వరల్డ్ రికార్డ్ కు ఎంపిక
పల్లెవెలుగు న్యూస్ ఎమ్మిగనూరు : ఎమ్మిగనూరు పట్టణం మిలిటరీ కాలనీ కి చెందిన మైక్రోస్ట్రక్చర్ మరియు సూక్ష్మ కళాకారుడు గుర్తింపు పొందిన డాక్టర్ బారికి చంద్రశేఖర్ అతి తక్కువ ఖర్చుతో అతి తక్కువ టైంలో ఒక రోబోట్ తల తయారుచేసి దానికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి రూపం ఇచ్చారు. ఆ రోబోను తయారు చేసి లిమ్కా వరల్డ్ రికార్డ్ కు ఎంపికయ్యారు. జనసేన పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గం పార్టీ రాష్ట్ర చేనేత సభ్యుడు రవి ప్రకాష గారు , జనసేన పార్టీ సభ్యులు ఎమ్మిగనూరు జనసేన పార్టీ కోఆర్డినేటర్ షబ్బీర్ మరియు పవన్ కళ్యాణ్ అభిమానులు అభినందించారు. గతంలో 2014 అతి చిన్న సినీ ప్రొజెక్టర్, ఒక చిన్న వాటర్ పంపు, అతి చిన్న ప్రింటర్, అతి చిన్న కటర్ వంటి సైన్స్ పరికరాలు తయారుచేసి లిమ్కా వరల్డ్ రికార్డ్ తో పాటు 24 ప్రపంచ రికార్డులను సాధించాడు 2016లో స్వేచ్ఛ భారత్ నాకు చిత్రాన్ని చిత్రకరించి స్వచ్ఛభారత్ కాంటెస్ట్లో ప్రదర్శించగా ఎన్ ఎఫ్ డి సి నేషనల్ అవార్డును అందుకున్నారు.ప్రతిభాను ప్రోత్సహించాలి అంటే ముందుగా కావాల్సింది చేయూత. సొంత డబ్బు ఖర్చు పెట్టి, ఇప్పటివరకు తయారు చేసినవి. పెద్దగా ఏదైనా ప్రయత్నిద్దాం అంటే ఆర్థికంగా పేదవాడు కనుక ఎవరైనా మంచి స్పాన్సర్ దొరికితే ఒక సరికొత్త రోబోట్ తయారు చేయాలని ఉంది అంటూ డాక్టర్ బారికి చంద్రశేఖర్ తోపాటు ఎమ్మిగనూరు బారికి చంద్రశేఖర్ ప్రతిభ ను సపోర్ట్ చేసే ప్రతి వారు కోరుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులు గుర్తించి దాతలు భారికి చంద్రశేఖర్ను ఆదుకుంటారని ఆశిస్తున్నాను అన్నారు.