PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మూన్నాళ్ళ ముచ్చటగా చెత్త సంపద కేంద్రాల నిర్వహణ

1 min read

filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; brp_mask:0; brp_del_th:null; brp_del_sen:null; delta:null; module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 44;

గ్రీన్ అంబాసిడర్లకు జీతాల చెల్లింపు ఎప్పుడు

గత ప్రభుత్వ హయంలో నిధులు నిల్

టిడిపి ప్రభుత్వంలోనైనా నిర్వహణ సాధ్యమేనా

పల్లెవెలుగు వెబ్ గడివేముల : గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుదలకు ప్రభుత్వాలు లక్షలు వెచ్చించి నిర్మించిన చెత్త సంపద తయారీ కేంద్రాలు అలంకారప్రాయంగా మారాయి. గ్రీన్అంబాసిడర్లకు కొన్ని నెలలుగా జీతాలు చెల్లించకపోవటంతో వారు విధులకు దూరంగా ఉన్నారు. చెత్త సేకరించేందుకు పంచాయతీలకు కేటాయించిన రిక్షాలు తుప్పుపడుతున్నాయి. పారిశుధ్య మెరుగుకు చర్యలు చేపట్టాల్సిన అధికారులు పట్టీపట్టనట్లువ్యవహరిస్తున్నారు.గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పూర్తిస్థాయిలో నిర్వీరమైపోయాయి . గ్రామాల్లో రోజువారీ విడుదలయ్యే చెత్తను సేకరించి ఆ కేంద్రాలకు తరలించాలన్నది లక్ష్యం. మండలంలోని 16 పంచాయతీలలో ఆ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పాలకులు పట్టించుకోకపోవడంతో కొంతకాలంగా గ్రామాల్లో రోడ్ల వెంట, చెత్త సంపద తయారీ కేంద్రాల వద్ద చెత్త కుప్పలుకుప్పలుగా పేరుకుపోయింది.  చెత్తసంపద తయారీ కేంద్రం నామరూపాలు కూడా కన్పించటం లేదంటే అధికారుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. మిగిలిన కొన్ని గ్రామాల్లో ఆ కేంద్రాలకు చెత్త సేకరణ నామమాత్రంగా జరుగుతోంది.ఘనవ్యర్థాల నిర్వహణ ద్వారా పంచాయతీలకు ఆదాయాన్ని వృద్ధి చేసేందుకు, ఓడీఎస్‌ గ్రామాలుగా తీర్చిదిద్ది ప్రభుత్వ ప్రోత్సాహం పొందేందుకు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదు. హరితరాయబారులకు వేతనాలు చెల్లించకపోవటంతో విధులకు రావటం మానేశారు. దీంతో గ్రామాల్లో పారిశుధ్యం పడకేసి ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని ప్రజలు వాపోతున్నారు.ప్రభుత్వం లక్షలాది రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన చెత్తసంపద తయారీ కేంద్రాల్లో ఒక్క కేంద్రం నుంచి ఎరువు తయారు చేసిన దాఖలాలు లేవు. అలాగే గృహాల నుంచి రోజువారీ విడుదలయ్యే చెత్తను ఆ కేంద్రాలకు తరలించేందుకు ప్రభుత్వం పంచాయతీలకు రిక్షాలను అందజేసింది. చెత్తను వేసేందుకు ప్రతి ఇంటికి రెండుచొప్పున డబ్బాలు పంపిణీ చేసింది. గతంలో చెత్తను సేకరించిన హరిత రాయబారులు చెత్త ఎక్కడ వేయాలో తెలియక రోడ్ల వెంబడే పడవేసి వెళుతున్నారు. అన్ని గ్రామాల్లో చెత్త సంపదకేంద్రాలువినియోగంలోకితీసుకురాకపోవటంతో ప్రజలు ఎక్కడపడితే అక్కడ చెత్తను, వ్యర్థపదార్థాలను పడవేస్తుండటంతో గ్రామాల్లో అపరిశుభ్రత నెలకొంది. ప్రభుత్వ నిధులతో నిర్మించిన చెత్త సంపద కేంద్రాలు వృథాగా పడిఉండటంతో అధికారుల తీరును ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. అధికారులు మాత్రం వీటిని వినియోగంలోకి తీసుకురావాలంటే ఖర్చుతో కూడుకున్న పని అని చేతులెత్తేస్తున్నారు. చెత్త తీసుకెళ్లే రిక్షాలు వాడకపోవటంతో తుప్పుబట్టి పోతున్నా పట్టించుకోవటం లేదు. ప్రభుత్వం స్పందించి అలంకారప్రాయంగా ఉన్న చెత్తసంపద తయారీ కేంద్రాలను వినియోగంలోకి తీసుకరావాలని, తుప్పుపడుతున్న చెత్త రిక్షాలు వినియోగంలోకి తీసుకొచ్చి గ్రామాల్లో అపరిశుభ్రతలేకుండా చర్యలు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు. అయితే మండలానికి చెత్త సేకరించే బుట్టలు గత వారం రావడం గమనార్హం అసలు చెత్తనే సేకరించడకుండా అటకెక్కిన ఈ పథకానికి మరి టిడిపి ప్రభుత్వహంలోని ఏర్పాటు చేసిన ఈ చెత్త సంపద కేంద్రాలు అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వ హయం లో ఏమేరా ఉపయోగంలోకి తెస్తారో చూడాలి మరి.

About Author