నేడు చెన్నూరులో మండల సర్వసభ్య సమావేశం
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు: స్థానిక ఎంపీడీవో సభా భవనంలో శనివారం ఉదయం 10 గంటలకు మండల సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవోబి. కిరణ్ మోహన్ రావు తెలిపారు .ఈ సమావేశం ఎంపీపీ చీర్లసురేష్ యాదవ్ అధ్యక్షతన నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ సమావేశంలోముఖ్యంగా ప్రాథమిక వైద్యం, వ్యవసాయం ,విద్యుత్తు, రోడ్లు ,త్రాగునీరు, విద్య, పారిశుద్ధ్యం, ఉపాధి, శిశు సంక్షేమ శాఖ ,స్వయం సహాయక గ్రూపులు ,నేషనల్ హైవే ,పంచాయతీరాజ్, కేసీ కెనాల్, గృహ నిర్మాణం, పశువైద్యం తదితర శాఖలపై సమీక్ష నిర్వహించడం జరుగుతుందని అన్నారు. కాగా ఆయాశాఖల అధికారులు ఆయా సమస్యలపై ఉన్న పూర్తి నివేదికలతో సమావేశానికి హాజరు కావాలన్నారు.ఈ సమావేశానికి ఎంపీటీసీలు, జడ్పిటిసి సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, సర్పంచులు ,పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది తప్పక హాజరు కావాలని ఆయన కోరారు.