మండల వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు : మండల వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆ పార్టీ నాయకులు విస్తృతంగా చేపట్టడంజరిగింది. మండలంలోని రామన పల్లి, గ్రామపంచాయతీలో శుక్రవారం, శనివారం మాజీ అటవీశాఖ డైరెక్టర్ తెలుగుదేశం పార్టీ నాయకురాలు రామన శ్రీలక్ష్మి, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు ఆధ్వర్యంలో టిడిపి సభ్యత్వ కార్యక్రమంలో పాల్గొని సభ్యత్వ నమోదు చేపట్టారు. ఈసందర్భంగా తెలుగుదేశం పార్టీ రామన శ్రీలక్ష్మి మాట్లాడుతూ కమలాపురం శాసనసభ్యులు పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి, ఆదేశాల మేరకు రామనపల్లె గ్రామపంచాయతీ వ్యాప్తంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టడం జరిగిందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ 4 వేల రూపాయలు పెంపు అదేవిధంగా మహిళలకు సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ లు తోపాటు సూపర్ సిక్స్ పథకాలను అమలు పరచడం జరుగుతుందన్నారు. తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న విధానాలకు ఆకర్షితులైన ప్రజలు భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోవడం జరుగుతుందన్నారు. పార్టీ సభ్యత్వ నమోదును మండల వ్యాప్తంగా అనుకున్న దానికన్నా ఎక్కువ చేసే విధంగా అటు టిడిపి నాయకులు కార్యకర్తలతో కలిసి కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రామన చంద్రమోహన్ రెడ్డి, పుత్త మహేంద్రారెడ్డి, ఐ టి డి పి ఛాంపియన్ యామాల మణికంఠ, కలబండి శ్రీధర్, టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.