మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటు
1 min readఆర్థిక సంస్కరణల రూప శిల్పి మన్మోహనుడు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు
పరిగెల మురళీకృష్ణ
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం దేశానికి, ప్రపంచానికి తీరని లోటు అని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మాజీ సభ్యులు పరిగెల మురళీకృష్ణ అభిప్రాయపడ్డాడు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో మన్మోహన్ సింగ్ సంతాప సభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసి మన్మోహన్ సింగ్ చిత్రపటమునకు పూలమాలు వేసి నివాళులర్పించిన అనంతరం మురళీకృష్ణ మాట్లాడుతూ ఆర్థిక సంస్కరణల రూపశిల్పి, ఆర్థిక సంస్కరణలకు ఆధ్యుడు, అవిశ్రాంత యోధుడు, మహోన్నత నాయకుడు, ఆ మహనీయుడి సంస్కరణలు, సాధించిన విజయాలు మన దేశ ప్రతి పౌరుడికి ఆదర్శంగా నిలవాలని కోరుచున్నానని మురళీకృష్ణ అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఎం సుధాకర్ బాబు, పార్లమెంటు కాంగ్రెస్ ఇంచార్జ్ పీజీ రాం పుల్లయ్య యాదవ్, పిసిసి మాజీ ప్రధాన కార్యదర్శి దామోదరం రాధాకృష్ణ కాంగ్రెస్ నాయకులు జి వెంకట శివారెడ్డి, ఎన్ సి బజారన్న, పోతుల శేఖర్, కే సత్యనారాయణ గుప్త, జిల్లా ఐ ఎన్ టి యు సి అధ్యక్షులు బి బతుకన్న, ప్రధాన కార్యదర్శి ఎన్ సుంకన్న, షేక్ ఖాజా హుస్సేన్ అనంతరత్నం మాదిగ, డివి సాంబశివుడు, షేక్ ఖాద్రీ పాషా, ఎస్ ప్రమీల, కే రాఘవేందర్ రెడ్డి, ఈ లాజరస్, షేక్ మాలిక్, డబ్ల్యూ సత్యరాజు, మిన్నెల్ల హుస్సేన్, వసీం, రంగస్వామి, అక్బర్ రుక్సానా, మొదలగు వారు పాల్గొన్నారు.