ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన ద్వార అనేక ప్రయోజనాలు
1 min readఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్
పల్లెవెలుగు వెబ్ ఆదోని: ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన ద్వార అనేక ప్రయోజనాలు పొందవచ్చని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పేర్కొన్నారు. గురువారం ఆదోని పట్టణంలోని వి. ఏస్. బి ఫంక్షన్ హాల్ నందు ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ…ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పొందడం ద్వార పర్యావరణన్ని కాపాడినవారుగా మరియు విద్యుత్ బిల్లుల మీద ఒక కిలో వాట్ 120 యూనిట్లకు రూ 1000/- వస్తుండగా సోలార్ ఏర్పాటుచేసిన తర్వాత వచ్చే బిల్లు రూ 338/- మాత్రమే ఏడాదికి 8000 రూపాయల వరకు పొదుపు చేసుకోవచ్చన్నారు. ఈ పథకం 2kW సామర్థ్యం గల సిస్టమ్‌లకు సోలార్ యూనిట్ ధరలో 60% మరియు 2 నుండి 3kW సామర్థ్యం మధ్య సిస్టమ్‌లకు అదనపు సిస్టమ్ ఖర్చులో 40% సబ్సిడీని అందిస్తుంది. సబ్సిడీని 3 కిలోవాట్ల సామర్థ్యానికి పరిమితం చేశారు. ప్రస్తుత బెంచ్‌మార్క్ ధరల ప్రకారం, దీని అర్థం 1kW సిస్టమ్‌కు రూ. 30,000, 2kW సిస్టమ్‌లకు రూ. 60,000 మరియు 3kW లేదా అంతకంటే ఎక్కువ సిస్టమ్‌లకు రూ. 78,000 సబ్సిడీ. మంజూరు చేస్తుందన్నారు. అనంతరం ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన ద్వార సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకున్న 3వాట్ల సద్వినియోగం చేసుకొని రూ 78 వేల వరకు రాయితీ పొందిన శ్రీనివాసులు, భద్ర మూర్తి, గోవిందరాజు, పురుషోత్తం వారికి సబ్ కలెక్టర్ శాలువా కప్పి పుష్ప గుచ్చెం అందజేసి అభినందించారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని పర్యావరణనాన్ని మేలు చేస్తూ, ఆదాయాన్ని పెంపొందించుకోవచ్చు సూచించారు. జాతీయ ఇందన పొదుపు వారోత్సవాలలో భాగంగా 14 డిసెంబర్ నుండి 20 డిసెంబర్ వరకు జరిగే కార్యక్రమాలకు సంబంధించి పోస్టర్/ బ్యానర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ కృష్ణ, విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హరి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (టెక్నికల్ ) ఓబులేసు, అసిస్టెంట్ డైరెక్టర్ పురుషోత్తం, ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గంటా సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.