PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా మరియ తల్లి పండుగ..

1 min read

దివ్య బలిపూజ సమర్పించిన బిషప్ గోరంట్ల జ్వాన్నేష్..

నవంబర్ 5 న గ్రామాల్లో బిషప్ పర్యటన..

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని ఉప్పలదడియ గ్రామంలోని ఆర్.సీ.యం విచారణ దేవాలయంలో విచారణ గురువులు ఫాదర్ డి మధుబాబు ఆధ్వర్యంలో బుధవారం జరిగిన మరియ తల్లి పండుగ ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్నూలు మేత్రాసన కాపరి (RCM బిషప్) శ్రీ శ్రీ గోరంట్ల జ్వాన్నేష్ ముఖ్య అతిథిగా హాజరై దివ్య బలి పూజనుసమర్పించారు.ముందుగా భారీ ఊరేగింపు నడుమ పూలతో విచారణ సంఘస్తులు ఘన స్వాగతం పలికారు. విచారణలోని ఉప్పలదడియ, కలమందలపాడు,మాసపేట, కడుమూరు,దిగువపాడు, కేతవరం,49 బన్నూరు చౌటుకూరు,దేవనూరు,పై పాలెం గ్రామాల కథోలిక విశ్వాసులు భారీగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా బిషప్ వాక్య పరిచర్య చేస్తూ అక్టోబర్ నెల మాసం అంతా కూడా మరియ తల్లిని జపమాలను స్మరించుకుంటూ మరియ తల్లిని మనం ఆరాధించడం లేదు గౌరవిస్తున్నామని అన్నారు.ప్రతి ఒక్కరూ కూడా దేవుని పట్ల విశ్వాసంతో జీవించాలని అంతే కాకుండా దేవుడు ఉన్నాడని నమ్మకం ఉండాలి మనం చేసే కార్యాలు దేవుడు చెప్పిన విధంగా ఉంటే జీవితాలు ధన్యం అవుతాయని అన్నారు.బిషప్ ,వివిధ విచారణల గురువులు సత్ప్రసాద అప్పమును క్రైస్తవులకు అందజేశారు. అనంతరం బిషప్ ని గజమాల మరియు శాలువాలతో ఘనంగా సత్కరించారు.తర్వాత కాన్వెంట్ మరియు పాఠశాల గదలు మరియు పరిసర ప్రాంతాలను బిషప్ పరిశీలించి  వీటి అభివృద్ధికి పది లక్షలతో మరమ్మతు పనులు చేయి స్తానని హామీ ఇచ్చారు.అంతేకాకుండా విచారణలో ఉన్న 10 గ్రామాల్లో వచ్చే నెల 5వ తేదీన పర్యటిస్తానని బిషప్ తెలిపారు.ఈ కార్యక్రమంలో జీవసుధ పాస్టరల్ సెంటర్ డైరెక్టర్ ఫాదర్ బాలరాజు,కేడిఎస్ఎస్ డైరెక్టర్ ఫాదర్ సుధాకర్,గురువులు లహస్రయ,రాజశేఖర్,బాల యేసు,విచారణ పెద్దలు పక్కి రయ్య,ఆనందరావు, ఆనిమేటర్లు చిన్నప్ప, బాలస్వామి,ఫ్రాన్సిస్,సామన్న,జాన్, హరి,సిద్దయ్య,ప్రసాద్,బాబు భాస్కర్ మరియు 10 గ్రామాల క్రైస్తవులు పాల్గొన్నారు.

About Author