గిరిజనులు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు
1 min readమహర్షి వాల్మికి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించిన జెసి పి. ధాత్రిరెడ్డి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : గిరిజనులు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు కల్పించి మెరుగైన ధర కల్పిస్తామని జాయింట్ కలెక్టర్, ఐటిడిఎ పివో పి. ధాత్రిరెడ్డి తెలిపారు. గురువారం ఐటీడీఏ, కె.ఆర్.పురం వారు కన్నాపురం నందు గెడ్డపల్లి గ్రామా గిరిజనుల చే ఏర్పాటు చేసిన, ప్రకృతి వన్ ధన్ వికాస్ కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి సందర్శించారు. అనంతరం కె.ఆర్.పురం ఐటిడిఎ కార్యాలయంలో మహర్షి వాల్మికి జయంతి సందర్బంగా వాల్మికి చిత్రపటానికి జెసి పి. ధాత్రిరెడ్డి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఐటీడీఏ మీటింగ్ హాల్ లో డివిజినల్ అధికారులతో వన్ ధన్ వికాస కేంద్రాల (విడివికె), గిరిజన సంఘాలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి ఉద్ధేశించిన పి.ఎం. జన్ మాన్, ఇంజనీరింగ్ పనులు, గిరిజన సంక్షేమ విద్య పై సమీక్షా సమావేశం నిర్వహించారు. పి.ఎం. జన్ మాన్ పధకం లో భాగంగా అన్ని లైన్ డిపార్ట్మెంట్ అధికారులతో సమీక్ష నిర్వహించి అన్ని పి.వి.టి.జి గ్రామాలలో నూరుశాతం లక్ష్యాలను చేరుకోవాలని ఆదేశించారు. కార్యక్రమం లో ఐటిడిఎ ఎపివో పి.వి.ఎస్ నాయుడు, వెలుగు ఎపిడి ఏజెన్సీ మండలాల ఎపిఎం లు పాల్గొన్నారు.