విద్యార్థులు ఉన్నతస్థానంలో ఉండేందుకు మార్షల్ ఆర్ట్స్ ఎంతగానో ఉపయోగపడుతాయి
1 min readడాక్టర్. శంకర్ శర్మ.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: జిల్లా స్థాయి తైక్వాండో పోటీలను కర్నూలు లో ప్రముఖ వైద్యులు శంకర్ శర్మ ప్రారంభించారు. నగరంలోని ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ఈక్రీడా పోటీల్లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ఈసందర్భంగా డాక్టర్. శంకర్ శర్మ మాట్లాడుతూ చిన్నారులను క్రీడల్లో ప్రొత్సహిస్తున్న తల్లిదండ్రులను అభినందించారు. చెస్ క్రీడాకారుడు గుకేష్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇండియా క్రికెట్ ప్లేయర్ నితీష్ కూమార్ రెడ్డి ని అభినందించారు. ఇద్దరు క్రీడాకారులు భారతదేశానికి గుర్తింపు తీసుకుని వచ్చారని వీరి కృషికి తల్లిదండ్రుల ప్రొత్సహం ఉన్నందునే వారు క్రీడల్లో రాణిస్తున్నారని తెలిపారు. ప్రపంచంలో యూత్ ఎక్కువగా ఉన్న దేశం భారతదేశం కాబట్టి యువత ఎక్కువ శాతం క్రీడల్లో పాల్గొనాలని డాక్టర్. శంకర్ శర్మ పేర్కొన్నారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల క్రమశిక్షణ ఏర్పడుతుందన్నారు. ప్రస్తుతం మార్షల్ ఆర్ట్స్ ఎంతో అవసరమని అందులో ప్రాణాయామం, యోగా, ధ్యానం, వ్యాయామం ఉండడం వల్ల విద్యార్థులకు ఎంతో మేలు చేస్తుందన్నారు. విద్యార్థులు సెల్ ఫోన్ కి దూరంగా ఉండాలని దీనివల్ల అనారోగ్య సమస్యలతో పాటు కంటి చూపు తగ్గుతుందన్నారు. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ.వెంకటేష్ కర్నూలు లో క్రీడాకారుల ప్రోత్సహిస్తున్నారని డాక్టర్. శంకర్ శర్మ ఈసందర్భంగా కొనియాడారు.ఈకార్యక్రమంలో డాక్టర్ శంకర్ శర్మ తో పాటు క్రీడా శిక్షకులు రామాంజనేయులు,చిన్న సుంకన్న, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.