వైసీపీ నుండి భారీగా బీజేపీలోకి చేరిక
1 min readపార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ..
పల్లెవెలుగు వెబ్ ఆదోని: ఆదోని మండల పరిధిలోని కపటి గ్రామం నుండి బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు బి.ఉషారాజు ఆధ్వర్యంలో కపటి గ్రామ వైసిపి మాజీ సర్పంచ్ బిలేకల్ రాజు మరియు వెంకటస్వామి హనుమేష్ ప్రస్తుత గ్రామ విద్యా కమిటీ చైర్మన్ రవి ఆధ్వర్యంలో సుమారు 200 కుటుంబాలు ఎమ్మెల్యే సమక్షంలో భారతీయ జనతా పార్టీలోకి చేరారు ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ బిలేకల్ రాజుగారు మాట్లాడుతూ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ప్రజా శ్రేయస్ కోసం తీసుకుని నిర్ణయాలకు ఆకర్షితులై కపటి గ్రామ అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీలకు చేయడం జరిగిందని తెలియపరిచారు.ఇకనుండి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను అనుచరిస్తామని వారు వెల్లడించారు .ఈ కార్యక్రమంలోజిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేంద్ర కుమార్, అసెంబ్లీ కో కన్వీనర్ నాగరాజ్ గౌడ్, మాజీ ఎంపీపీ పంపాపతి గ్రామ బిజెపి నాయకులు వెంకట్ స్వామి ప్రస్తుత విద్యా కమిటీ చైర్మన్ రవి రాఘవేంద్ర రాజబాబు వీరేష్ కైపాల్ తదితరులు పాల్గొనడం జరిగింది.