నారాయణ విద్యాసంస్థలో ఘనంగా మాస్టర్ ఓరేటర్ ప్రోగ్రాం
1 min readముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి ఫరూక్
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: నంద్యాల పట్టణం సాయిబాబా నగర్ లో ఉన్న నారాయణ విద్యాసంస్థలందు ఘనంగా మాస్టర్ ఓరేటర్ ప్రోగ్రాం నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ , నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జోనల్ బ్రాంచ్ లైన నంద్యాల ఈఎన్ సిఎస్ , నంద్యాల ఓఎన్ సిఎస్ , నంద్యాల ఎస్ బిఎన్ , గిద్దలూరు , నందికొట్కూర్ , మార్కాపురం బ్రాంచ్లలో విద్యార్థులకు పోటీలు నిర్వహించగా సెలెక్ట్ అయిన పిల్లలకు ఫైనల్ లెవెల్ కాంపిటేషన్ డిసెంబర్ 1 తేదీన నిర్వహించారు .ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ విద్యార్థులను అన్ని రంగాలలో నిష్ణాతులను చేస్తున్న నారాయణ విద్యాసంస్థలను అభినందించారు . విద్యార్థులలు అన్ని స్కిల్స్ లో మన యొక్క ప్రతిభ ప్రదర్శించాలని ప్రోత్సహించారు విద్యార్థులు వివిధ రకాల వేషధారణలతో పాటు చక్కటి నైపుణ్యాన్ని ప్రదర్శించి అందరి మన్నలను పొందారు ప్రతిభావంతులైన విద్యార్థులకు మంత్రి ఫరూక్ , జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ , నారాయణ విద్యాసంస్థల ఏజీఎం ప్రశాంత్ బహుమతులు అందించడం జరిగింది . ఈ సందర్భంగా హోస్ట్ బ్రాంచ్ ప్రిన్సిపాల్ స్వరూప రాణి మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలకు నారాయణ విద్యాసంస్థలు ఎప్పుడు స్వాగతం పలుకుతూనే ఉంటాయని తెలియజేశారు . అనంతరం ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్కూలు ఆర్ఐ చంద్రమౌళి , కోఆర్డినేటర్ , ఏవోఎస్ మరియు ప్రిన్సిపల్స్ ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.