ఘనంగా మౌలానా అబుల్ కలాం జయంతి..
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: స్వాతంత్ర సమరయోధులు మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని మిడుతూరు రహదారి ప్రభుత్వ జూనియర్ కళాశాల మలుపు దగ్గర ముస్లిం మైనారిటీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు సౌదీ చాంద్ బాష ఆధ్వర్యంలో షేక్ బొండఅబ్దుల్ల,రసూల్ ఖాన్, వలి,షఫీ ఉల్లా ఆజాద్ విగ్రహానికి పూలమాలలతో జయంతి వేడుకలు సోమవారం మధ్యాహ్నం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సౌది చాంద్ మాట్లాడుతూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ దేశానికి చేసిన సేవలు ఎన్నో ఉన్నాయని 1888 నవంబర్ 11న ఆయన మక్కాలో జన్మించారని తర్వాత ఫిబ్రవరి 22 1958 లో ఆయన ఢిల్లీలో మరణించారని అన్నారు.దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా 11 సం.ల పాటుగా పని చేస్తూ విద్యాభివృద్ధికి ఆయన కృషి చేశారని ఆయన ప్రఖ్యాత పండితుడు కవి అని అరబిక్, ఇంగ్లీష్,ఉర్దూ హిందీ పెర్సియన్,బెంగాలీ మొదలగు అనేక భాషల్లో ప్రావీన్యుడు అని ఈయన అసలు పేరు ‘మోహియుద్దీన్ అహ్మద్’ అబుల్ కలాం అనే బిరుదు వచ్చిందని అంతే కాకుండా ఆయన చేసిన సేవలను వారు కొనియాడారు.