‘ మౌర్య’లో.. క్వాలిటీ వైద్యం..
1 min readరాష్ట్ర మంత్రులు టిజి భరత్, ఎన్ ఎండి ఫరూక్
- ‘ మౌర్య ’ హాస్పిటల్ ను ప్రారంభించిన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టిజి భరత్, ఎన్ ఎండి ఫరూర్, ఎంపీ శబరి రెడ్డి, బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి
కర్నూలు, పల్లెవెలుగు:రాయలసీమలోనే వైద్య రంగంలో అత్యంత కీర్తి గడించిన కర్నూలులో మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు రాష్ట్ర మంత్రులు టిజి భరత్, ఎన్ ఎండి ఫరూక్. శనివారం స్థానిక దేవనగర్ కు వెళ్లే రహదారిలో గాయత్రి జూనియర్ కళాశాల ఎదురుగా నూతనంగా నిర్మించిన‘ మౌర్య ’ హాస్పిటల్ ను రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టిజి భరత్, మంత్రి ఎన్ ఎండి ఫరూర్, నంద్యాల ఎంపీ శబరి రెడ్డి, కర్నూలు బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఆ తరువాత జ్యోతి ప్రజ్వలనగావించారు. ఈ సందర్భంగా ఆర్థో పెడిక్ వైద్యులు డా. ఎం. రాజేష్ కుమార్ , సైకియాట్రిక్ డా. కంచర్ల హరి ప్రసాద్, ల్యాప్రో స్కోపిక్ వైద్యులు డా. వసిమ్ హసన్ రాజ షేక్, అనస్థియా వైద్యులు డా.ఎం. రఘు ప్రవీణ్ మాట్లాడుతూ అత్యాధునిక టెక్నాలజీతో కూడిన పరికరాలను ‘ మౌర్య ’ హాస్పిటల్ లో ఏర్పాటు చేశామని, పేదలకు మెరుగైన వైద్య సేవలు అందజేస్తామన్నారు. మానసిక రుగ్మత , ఎముకలకు సంబంధించిన వ్యాధులు, కంటి సమస్యలు తదితర చికిత్సలను ల్యాపో స్కోపిక్ తో శస్ర్తచికిత్సలు చేస్తామన్నారు. గర్భిణీలకు, అత్యవసర వైద్య చికిత్స కోసం 24 గంటలు అందుబాటులో ఉంటామని స్పష్టం చేశారు. తక్కువ వ్యయంతో కార్పొరేట్ వైద్యం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, నవంబరు 1 నుంచి పూర్తి వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా మానసిక వైద్య నిపుణులు డా. కంచర్ల హరి ప్రసాద్ వెల్లడించారు. కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ ఈడీ సబిహ పర్వీన్, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.