‘మౌర్య క్లినిక్’ లో కంటి పరీక్షలు
1 min readక్లినిక్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి
కర్నూలు, పల్లెవెలుగు: ఆధునిక సమాజంలో ప్రజలు కంటి సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి మెరుగైన చికిత్స చేసి.. వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించారు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి. ఆదివారం స్థానిక గాయత్రి ఎస్టేట్ లోని మౌర్య హాస్పిటల్లో మౌర్య ’కంటి’ క్లినిక్ ను ఆమె ప్రారంభించారు. అంతకు ముందు ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డికి కంటి వైద్యులు డా. సౌజన్య, సైకియాట్రిక్ వైద్యులు డా. హరి ప్రసాద్ కంచర్ల, ఆర్థో పెడిక్ వైద్యులు డా. రాజేష్ తదితరులు పుష్పగుచ్చం అందజేసి.. ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కంప్యూటర్, సెల్ ఫోన్ల వాడకం వల్ల కంటి సమస్యలతో అవస్థలు పడుతున్నారని, అటువంటి వారికి మెరుగైన తక్కువ ధరకు …మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఆ తరువాత కంటి వైద్య నిపుణులు డా. సౌజన్య మాట్లాడుతూ విశ్వభారతి, శాంతిరామ్ మెడికల్ కాలేజి, ఆఫ్రికాలో 25వేలకు పైగా కంటి శుక్తం ఆపరేషన్ చేశానన్నారు. అంతే కాక 18 ఏళ్ల పైగా ఉన్న వారికి అద్దాలు లేకుండా లేసర్ ఆపరేషన్లు, రెటినా పరీక్షలు, రెటినోపతి, గ్లకోమా నీటి కాసుల శుక్లము చికిత్స లేసర్ , నల్ల గుడ్డు సమస్యలు, శుక్లము ఆపరేషన్లు, సూదివేయకుండా , మెల్లకన్ను పరీక్షలను విజయవంతంగా పూర్తి చేశానన్నారు. మౌర్య క్లినిక్‌లో ప్రజలకు అందుబాటులో ఉండి… తక్కువ ధరకే వైద్య సేవలు అందజేస్తామన్నారు.