నూతన సంవత్సరంలో ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలి
1 min readఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్.
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి: నూతన సంవత్సరంలో ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆకాంక్షించారు. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ప్రజలందరికీ ఎంపీ మహేష్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గడిచిన ఆరు నెలల కాలంలో ఏలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నిలపడమే లక్ష్యంగా పనిచేసినట్లు ఎంపీ మహేష్ కుమార్ పేర్కొన్నారు. రానున్న రోజుల్లో కూడా ఏలూరు పార్లమెంట్ పరిధిలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు ఎంపీ తెలిపారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అధికార పగ్గాలు చేపట్టిన కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తుందని ఎంపీ స్పష్టం చేశారు. 2025 నూతన సంవత్సరం వేడుకలు ప్రజలంతా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఎంపీ తెలిపారు.