నూతన సంవత్సరంలో ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలి
1 min readఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఏపీఎన్జీవోస్ అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి: నూతన సంవత్సరంలో ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఎన్జీవోస్ అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్ ఆకాంక్షించారు. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ప్రజలందరికీ ఆయన మంగళవారం ఒక ప్రకటనలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గడిచిన ఆరు నెలల కాలంలో ఏలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నిలపడమే లక్ష్యంగా పనిచేసిన ఎంపీ పుట్ట మహేష్ కుమార్, ఎమ్మెల్యే బడేటి వెంకటరామయ్య (చంటి,) జిల్లా కలెక్టర్ కె వెట్రి సెల్వి,ఎస్పీ శివ కిషోర్ ప్రతాప్, జాయింట్ కలెక్టర్ పి ధాత్రి రెడ్డి, జిల్లా ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు మంచి పరిపాలన అందించారని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో కూడా ఏలూరు పార్లమెంట్ పరిధిలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించాలని సుందర నగరంగా తీర్చేదిద్దాలని చోడగిరి తెలిపారు. రాష్ట్రంలో డైనమిక్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అధికార పగ్గాలు చేపట్టిన కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. 2025 నూతన సంవత్సరం వేడుకలు సుఖ సంతోషాలతో ప్రతి కుటుంబం, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రజలంతా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని తెలిపారు.