ఇండియా కూటమి ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి మీడియా సమావేశం..
1 min readపార్టీ ప్రచారానికి ఎమ్మెల్యే అభ్యర్థులు లక్షలు డిమాండ్
మానసికంగా హింసించి, వేది వేధించారని మీడియా ముందు ఆరోపణ
ఇటువంటి వ్యక్తులను పార్టీ నుంచి తక్షణం తొలగించాలి
కావూరి లావణ్య ఆవేదన
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఆంధ్రప్రదేశ్ లొ కాంగ్రెస్ పార్టీ ని బలోపేతం చెయ్యడంలో మా ప్రయత్నం లొ లోపం లేకుండ కృషి చేసామనాని ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి కావూరు లావణ్య అన్నారు. మంగళవారం పార్టీ క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేనుఎన్ ఆర్ ఐ అయినా కానీ కాంగ్రెస్ పార్టీ నాకు అవకాశం కల్పించిందని సంతోషం వ్యక్తం చేశారు.కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు వై ఎస్. షర్మిలమ్మ మాకు అందరికి అందుబాటులో ఉంటూ మా కోసం మూడు సార్లు ఏలూరు పార్లమెంట్ పరిధి లొ తిరగడం తో ఓటర్లు లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభం వస్తుందన్న ఆశతో ఆకర్షితులయ్యారన్నారు.మా ప్రతి పక్షం వారు వైసీపీ టీడీపీ వారు కచ్చితంగా గెలుస్తామని చెప్పలేకపోతున్నారంటే మేము ఎంత గట్టి పోటీ ఇచ్చామో వారికి అర్ధం అయ్యిందని అన్నారు.ఏలూరు పార్లమెంట్ పరిధి లొ అనేక పర్యాయలు ప్రజల్లోకి వెళ్ళాను ఎమ్మెల్యే అభ్యర్థులుపార్టీ ప్రచార పరంగా మాకు ఇంకా కొంచెం సహకారం అందించి ఉంటే మేము ఇంకా ముందుకు వెళ్ళావాళ్ళమన్నరు.ఈ విషయాలు అన్ని మేము హై కమా డ్ దృష్టికి తీసుకెళ్తాను.కాంగ్రెస్ పార్టీ లొ ఒక వ్యక్తి ఉన్నత స్థానంలో ఉన్న డీసీసీపీ పదవి లొ ఉండి నన్ను డబ్బులు ఇవ్వమని ఒత్తిడి తెచ్చి కనీసం కాంగ్రెస్ కార్యకర్తలను ప్రచారానికి రానివ్వని పరిస్థితి నెలకొందన్నరు. అధిష్టానం దీనిని అర్ధం చేసుకోవాలి. ఇలాంటి వారిని కాంగ్రెస్ నుంచి తీసివేయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.జిల్లా అధ్యక్షులు పదివిలో ఉన్న మీరు మీ ఇంట్లోనే వేరే వ్యక్తి కి ఇండిపెండెంట్ గా పోటీ చేయించి వేరే పార్టీ వాళ్ల దగ్గర డబ్బులు తీసుకున్న పరిస్థితులు ఏలూరు లొ ఏర్పడ్డాయన్నారు.పోలవరం లొ ఎమ్మెల్యే అభ్యర్థి కి డబ్బులు డిమాండ్ చేశారు.ఆవిడ కూడా ఎమౌంట్ ఇవ్వలేక పొతే ఆమెను ప్రచారం లోకి రానియ్యకుండ చేసిన పరిస్థితులు ఉన్నాయన్నారు.కాంగ్రెస్ పార్టీ లొ ఎమ్మెల్యే అభ్యర్థులకు కొంతమంది కి ఆర్థికంగా సహాయం చేద్దామనుకున్నాను. కానీ జిల్లా అధ్యక్షులు ఎంపీ అభ్యర్థి అమౌంట్ ఇస్తారని. ఆమె ఎన్నారై అని ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ ముందస్తు ప్రచారం చేస్తూ పార్టీ కార్యక్రమాలను ముందుకు సాగరయ్యకుండా దెబ్బ తీశారు.రేపు నేను గెలుస్తానో లేదో నాకు తెలియ్యక పోయిన హైకమాండ్ అన్ని విషయాలు తెలియాలి, ఇక్కడ పరిస్థితులు తెలియజేయడం ముఖ్యమన్నారు.జిల్లా అధ్యక్షులు పదవిలో ఉన్న వ్యక్తి వేరే పార్టీ లకు సప్పోర్ట్ గా ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీపరిస్థితి ఏమిటని అడుగుతున్నాని అసహనంతో మీడియా ముందు వాపోయారు.నా ప్రచార రాధాలు కూడా కదలనియ్యకుండా ఆపేసారని సొంత పార్టీ లోనే ఇటువంటి వ్యక్తులు. పరిస్థితులు ఉన్నాయంటే, కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్లడం సాధ్యం కాదని 2029 నాటికి చాలా కష్టమన్నారు. దెందులూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ఆలపాటి నరసింహ మూర్తి కూడా మమ్మల్ని బలవంతగా నివారిస్తూ మా వాహనాలను మూడు తన ఏరియాలో సీజ్ చేసి బెదిరించే ప్రయత్నం చేశారన్నరు. కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ప్రటించడంతో నేను ఏలూరు పార్లమెంటు పరిధిలో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థి లందరిని రమ్మని పిలిస్తే, ఒకరు సమయం లేదని, ఒకరు ముందస్తు సమాచారం లేదని అంటూనేవచ్చినవారు మమ్మల్ని కోట్లు ఇవ్వండి అని నన్ను అడిగారన్నారు.ప్రచార వాహనాలపై చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థి ఎలిజా కనీసం ఎంపీ అభ్యర్థి నైనా నా ఫోటో కూడా పెట్టుకోకుండా ప్రచారం చేశారన్నరు.చింతలపూడి, దెందులూరు ఆఫీస్ లొ కనీసం నా ఫోటో కూడా లేదు.బూత్ ఏజెంట్ లను పెట్టడానికి కనీసం 12లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబ్బుల కోసం ఒక మహిళా ఎంపీ అభ్యర్థినన్న ఇంగిత జ్ఞానం లేకుండా వేధించారని, హింసించారని ఆవేదన వ్యక్తం చేశారు.అధిష్టానం దృష్టిలో ఈ విషయం పై నన్ను అడిగితె నేను అన్ని ఫ్రూఫ్ లతో సిద్దమగా ఉన్ననని. ఈ వాస్తవాలను అవాస్తవాలుగా నిర్ణయిస్తే పార్టీ తీసుకున్న చర్యలకు కట్టుబడి ఉంటానన్నరు.చింతలపూడి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎలిజా ఆఫీస్ లొ తెలుగుదేశం అభ్యర్థి సొంగ రోషన్ ఉండటం బట్టి పరిస్థితి ఎలా ఉందొ చూడండని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకుంటూ ఇతర పార్టీలకు కొమ్ము కాయడం ఎంతవరకు సమంజసం అన్నారు.కాంగ్రెస్ పార్టీ 2029కల్లా ముందుకు వెళ్ళాలి అంటే తప్పకుండ క్యాడర్ ని మొత్తం మార్చాల్సిన పరిస్థితి ఉందన్నరు.