PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఈ ఆదివారం మీ జీ తెలుగులో  ‘‘ఊరు పేరు భైరవకోన’’

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు : జీ తెలుగు ఈ ఆదివారం మరో సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్ తో మీ ముందుకు రాబోతోంది, ఆసక్తికరమైన కథాంశంతో మిస్టరీ, అడ్వెంచరస్ హారర్ మూవీగా రూపొందిన ఊరు పేరు భైరవకోన జూన్ 30, ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు మీ జీ తెలుగులో ప్రదర్శన కానుంది.’ఊరు పేరు భైరవకోన’ సినిమా కథ బసవ పాత్ర చుట్టూ తిరుగుతుంది బసవ (సందీప్ కిషన్) తన స్నేహితుడు జాన్ (వైవా హర్ష)తో కలిసి ఓ దొంగతనం చేస్తాడు. ఈ క్రమంలో పోలీసుల నుంచి తప్పించుకుంటూ అనుకోకుండా భైరవకోన అనే ఊరిలోకి వస్తారు అయితే, ఈ ఇద్దరితో పాటు గీత (కావ్య థాపర్) కూడా ఆ ఉళ్ళోకి వస్తుంది. ఇంతకే, ఆ భైరవకోన ఊరు ప్రత్యేకత ఏంటి ?, అక్కడ కనిపించే మనుషులు ఎవరు? గరుడ పురాణంలో కనపడకుండా పోయిన నాలుగు పేజీలకి భైరవకోనకి మధ్య ఉన్న సంబంధం ఏంటి? అనే విషయాలు తెలియాలంటే ఊరు పేరు భైరవకోన సినిమా చూడాల్సిందే!.ప్రధాన నటీనటుల అద్భుతమైన నటన ఆకట్టుకునే కథాంశంతో ఫాంటసీ, డ్రామాగా ప్రేక్షకులను అలరించేందుకు ‘ఊరు పేరు భైరవకోన’ సిద్ధమైంది. విఐ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ, కావ్య దాపర్ ప్రధాన పాత్రలు పోషించగా, వైవా హర్ష, వెన్నెల కిషోర్, పి. రవికుకర్ ఇతర కీలకపాత్రలు పోషించారు.

About Author