PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దీపం పధకంపై గ్యాస్ డీలర్లు, పౌర సరఫరాల అధికారులతో సమావేశం

1 min read

దీపం పధకంపై వచ్చిన ఫిర్యాదులపై 17 మంది ఎల్ పిజి డీలర్లకు నోటిసులు జారి

ఫిర్యాదులు రుజువైతే ఆయా గ్యాస్ ఏజెన్సీలను బ్లాక్ లిస్టులో పెట్టి  లైసెన్సులను రద్దు చేస్తాం

జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి

పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి: దీపం పధకం లబ్దిదారుల నుంచి వచ్చిన ఫిర్యాదుల పై  విచారించి 17 మంది ఎల్ పిజి డీలర్లకు నోటిసులు ఇవ్వడం జరిగిందని జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి తెలిపారు. స్ధానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో బుధవారం దీపం పధకం అమలుపై జిల్లాలోని గ్యాస్ డీలర్లు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, పౌర సరఫరాల శాఖ అధికారులతో జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ దీపం పధకంపై లబ్దిదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై విచారణ అనంతరం రుజువు అయ్యిన యెడల సదరు గ్యాస్ ఏజన్సీల పై తగు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.  ఆదే విధంగా సంబంధిత ఏజెన్సీలను బ్లాక్ లిస్టులో పెట్టి వారి లైసెన్సులను రద్దు చేస్తామని హెచ్చరించారు.  దీపం పధకం కింద ఉచితంగా గ్యాస్ సిలిండర్లు పొందుతున్న సిలిండర్లకు తాము చెల్లించిన నగదు మూడు రోజుల్లోపు తమ ఖాతాల్లో జమ అవుతున్నాయని పలువురు  లబ్దిదారులు సంతోషం వ్యక్తం చేశారని ఆమె తెలిపారు.   లబ్దిదారులు దీపం 2 ఉచిత గ్యాస్ పథకం కింద చెల్లించాల్సిన అసలు బిల్లుకు అదనంగా రూ.80 నుండి రూ.150 వరకు కొన్ని గ్యాస్ ఏజెన్సీల డెలివరీ బాయ్ లు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయని అటువంటి చర్యలకు పాల్పడితే సంబంధిత గ్యాస్ ఏజెన్సీ డీలర్లు బాధ్యత వహించాల్సివుంటుందని హెచ్చరించారు. గ్యాస్ వినియోగదారులు, వారికిచ్చిన రశీదులో ముద్రించి ఉన్న ధర కంటే అదనంగా చెల్లించనవసరం లేదని, కాకుండా లబ్దిదారుల నుండి గ్యాస్ ఏజన్సీలు అదనంగా డబ్బులు వసూలు చేసినట్లయితే, వినియోగదారుడు సంబంధిత అయిల్  మార్కెటింగ్ కంపెనీ సేల్స్ అధికారికి, మండల తహశీల్దార్/పౌర సరఫరాల తహశీల్దార్ లేదా జిల్లా పౌర సరఫరాల అధికారి వారికి పిర్యాదు చేయాలని లేదా టోల్ ఫ్రీ నెం 18004256453/1967 టోల్ ఫ్రీ నెంబర్లుకి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. వినియోగదారుడు గ్యాస్ సిలిండర్ తీసుకును సమయములో తూకములో తేడా ఉన్నట్లు అనుమానం ఉన్నయడల సదరు డెలివరీ బాయ్స్ ద్వారా తూకం సరిచూచుకోవాలన్నారు. ప్రతీ గ్యాస్ కంపెనీ డెలివరీ సమయంలో” హ్యాండిల్ వేయింగ్ స్కేలు” వినియోగదారుని వద్దకు తీసుకువెళ్లాని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.జిల్లాలో అర్హులయిన దీపం.2 పధకం లబ్దిదారుల యొక్క డేటా ఈకెవైసి, ఆధార్ సీడింగ్ , బ్యాంకు లింకింగ్  ఇతర రైసు కార్డు సమస్యలు ను ఎప్పటి కప్పుడు తెలుసుకొని సమస్యలను త్వరితగతిన పరిస్కరించి వారి ఖాతా లో సబ్సిడీ పడేటట్లు చూడాలని డిఎస్ఓ ను ఆదేశించారు. సమావేశంలో  డిఎస్ఓ ఆర్. ఎస్.ఎస్ సత్యనారాయణ రాజు, హెచ్ పిసిఎల్ ఎం. వెంకటేశ్వర్లు, ఐఓసిఎల్ ప్రసాద్,  తూనికల కొలతల ఇన్స్పెక్టర్, పౌర సరఫరా డిప్యూటి తహశీల్దార్లు, జిల్లాలో గల గ్యాస్ డీలర్లు అందరూ పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *